తెలుగు పచ్చడి రుచి వేరయా...తయారీలో ప్రముఖులు
తెలుగు పచ్చడంటే ఎవరికైనా నోరూరకు మానదు... అదే తెలుగింటి ఆడపడులు ఎంతటి వారైనా తాము స్వంతంగా తయారు చేసుకుంటే తప్ప ముట్టనైనా ముట్టరు... ఉదయం మజ్జిగ అన్నం నుంచి మధ్యాహ్నం పప్పుల్లో కలుపుతుని దీనికి కాస్త నెయ్యి జోడిస్తే దాని రుచే వేరుగా ఉంటుంది.
తెలుగు పచ్చడంటే ఎవరికైనా నోరూరకు మానదు... అదే తెలుగింటి ఆడపడులు ఎంతటి వారైనా తాము స్వంతంగా తయారు చేసుకుంటే తప్ప ముట్టనైనా ముట్టరు... ఉదయం మజ్జిగ అన్నం నుంచి మధ్యాహ్నం పప్పుల్లో కలుపుతుని దీనికి కాస్త నెయ్యి జోడిస్తే దాని రుచే వేరుగా ఉంటుంది.అందుకే మన పచ్చళ్లను ఇతర దేశాలకు ఖర్చు ఎక్కువయినా లెక్కచేయకుండా ఇతర దేశాలకు తీసుకెళుతుంటారు. అంతటి ప్రాధాన్యత ఉన్న పచ్చడిని పెట్టేందుకు తెలంగాణా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిద్ధమయ్యారు.
నిత్యం అధికారిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఇంట్లో మామిడి కాయ పచ్చడి పెట్టేందుకు సమయం కేటాయించారు. మామిడి కాయ తొక్కు అంటే ఇష్టం లేని వారు తెలుగు రాష్ట్రల్లో ఉండరేమో. ఎంత ధనికులు అయినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కొత్త మామిడి కాయ తొక్కు రుచికి ఫిదా అవ్వాల్సిందే. లాక్ డౌన్ పుణ్యమాని ప్రతిఒక్కరూ ఏదోక పని చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఒకరు రుచికరమైన వంటలు చేస్తుంటే, మరొకరు ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే కోవలో పచ్చడి తయారీ చేస్తూ సందడి చేశారు మంత్రి.
తాము స్వయంగా పచ్చడ తయారు చేసిన దృశ్యాలను ప్రజలతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన భర్త మాజీ మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు పొలం పనులు చేసిన సంఘటనను గుర్తు చేస్తూ నేనూ సగటు మహిళనే అన్న తీరులో పచ్చడి తయారీ చేశారు. పెద్ద హోదాలో ఉన్నా ఇంట్లో అమ్మనే అని సమాజానికి సందేశం ఇచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.