Mi 10 Ultra is coming: ఫొటోలే కాదు.. సినిమాలే తీసేయొచ్చు.. అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ 10 అల్ట్రా ఫోన్!

Mi 10 Ultra is coming: ఫోనులో కెమెరా పై మోజు ఉన్న వాళ్ళకోసం అదిరిపోయే ఫీచర్లతో జియోమీ కొత్త ఫోన్ తెస్తోంది.

Update: 2020-08-10 15:40 GMT
Mi 10 ultra mobile launching tommarrow

కొత్తగా ఏదైనా వస్తుందంటే అందరికీ విపరీతమైన ఆసక్తి. అందులోనూ మొబైల్ ఫోన్లంటే ఇక చెప్పక్కర్లేదు. ఎన్ని కంపెనీలు వచ్చినా.. ఎన్ని మోడల్స్ వచ్చినా అన్నిటినీ కోనేయాలన్నంత ఉత్సాహం మొబైల్ అభిమానులకు. ఏదైనా కొత్త మోడల్ వస్తోందని తెలిస్తే చాలు దాని విషయాలు తెలుసుకోవాలనే ఆత్రుత చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇక ఎంఐ కంపెనీ( మనందరికీ తెలిసిన పేరు. వాస్తవానికి ఇది జియోమీ కంపెనీ)ది మొబైల్ ఫోన్లలో ప్రత్యేకమైన స్థానం అని చెప్పాలి. తక్కువ ఖరీదులో ఎక్కువ ఫీచర్లు ఈ కంపెనీ మొబైల్స్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే అధునాతన ఫీచర్లతో.. ఆ కంపెనీల ధరలకంటే అతి తక్కువ ధరలలోనే ఫోన్లను అందిస్తూ వస్తోంది ఎంఐ. ఇప్పుడు సరికొత్తగా మరో మోడల్ మార్కెట్ లోకి రావడానికి సిద్ధమైపోయింది ఎంఐ నుంచి.

ఇక సహజంగానే మొబైల్ ప్రియులు ఈ సరికొత్త ఫోన్ ఎలా ఉండబోతోండానే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రేపు (11 ఆగస్టు) షియోమీ కంపెనీ వార్షికోత్సవం. ee సందర్భంగా చైనా మార్కెట్లో విడుదల కాబోతున్నఈఫోను కు సంబంధించి కొన్ని ఫీచర్లు ఇటీవల లీకయ్యాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆ ఫీచర్లను పరిశీలిస్తే.. ఎంఐ ఈ ఫోన్ తో సంచలనం సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంఐ లంచ్ చేయబోతున్న అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌ ఎంఐ10 అల్ట్రా ఫోను విశేషాలు చూస్తె మీరూ ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందా అని కచ్చితంగా ఎదురుచూస్తారు.

ఫోటోలేం ఖర్మ.. ఏకంగా సినిమాలే తీసేయొచ్చు..

ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఎంఐ10 అల్ట్రా ఫోనులో అత్యంత అధునాతనమైన కెమెరాలు అమరుస్తున్నారు. ముఖ్యంగా వీడియోల విషయంలో 8కే వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో ఫీచర్ ఫిల్మ్ లు కూడా తీసేయోచ్చట. పెద్ద పెద్ద సినిమా కేమేరాల్లోనే ఈ 8కె ఫీచర్ లేదని పరిశీలకులు చెబుతున్నారు. అంటే ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్స్ కి ఈ ఎంఐ10 అల్ట్రా ఫోను అద్భుతమైన పరికరం కాబోతోందని చెప్పవచ్చు.

ఇక ఏకంగా నాలుగు లెన్సులతో 120 ఎక్స్ డిజిటల్ జూమ్ కెమెరా స్పష్టమైన ఫోటోలు ఎంత దూరం నుంచైనా తీసేయొచ్చు.

కెమెరాల సంగతి పక్కన పెడితే, ఇంకా చాలా అధునాతన ఫీచర్లు ఎంఐ10 అల్ట్రా ఫోనులో ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఓ లుక్కేయండి..

    - ఇందులో టూ వేరియంట్స్ ఉన్నాయి. మొదటిది సెరామిక్ వెర్షన్.. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ… అందులోనే మరొకటి 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ…

    - రెండో వేరియంట్ ట్రాన్స్‌పరెంట్ వెర్షన్… 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ… అందులోనే మరొకటి ఏకంగా 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ.

    - ఫాస్ట్ చార్జింగ్ ప్లస్ వైర్‌లెస్ చార్జింగ్…

    - 120 Hz, 1080 అమోలెడ్ డిస్‌ప్లే

    - క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ చిప్‌సెట్ అంటే స్పీడ్ మరింత ఎక్కువ!

    - 6.67 ఇంచుల డిస్‌ప్లే .. 2340 x 1080 pixels రిజల్యూషన్…

    - 5జీ ఫోన్… ఆ సర్వీసు మన దేశంలో ఎప్పుడొచ్చినా సరే, వెంటనే వాడుకోవచ్చు…

    - 5000000:1 కంట్రాస్టు రేషియోతో డిస్‌ప్లే ..

ఇవండీ ప్రస్తుతానికి తెలుస్తున్న ఎంఐ10 అల్ట్రా ఫోను ఫీచర్ల వివరాలు. ఎలాగూ రేపు ఫోన్ విడుదల అయినతరువాత పూర్తీ వివరాలు అందుతాయి. మరో వారం పదిరోజుల్లో మన దేశంలోనూ ఈఫోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని చెప్పారు ఎంతలో దొరుకుతుందో అని మాత్రం అడక్కండి.. ప్రస్తుతం ఈ వివరాలు తెలియలేదు. ఫోన్ లాంచ్ అయినప్పుడు ఆ వివరాలు తెలుస్తాయి. కానీ, ఎంఐ అంటే చవకలో దొరికే ఫోన్లె కదా.. కచ్చితంగా అందరికీ అందుబాటులో ఈ మోడల్ కూడా దొరకొచ్చని అంచనా వేస్తున్నారు.  

Tags:    

Similar News