పిల్లల కోసం ప్రత్యేక యాప్...
ఫేస్ బుక్, వాట్సప్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాలు తమ వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తాయి.
ఫేస్ బుక్, వాట్సప్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాలు తమ వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తాయి. ఇదే తరహాలో ఇప్పుడు ఇప్పుడు ఫేస్ బుక్ కూడా ఓ కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల, కళాశాల విద్యార్ధులు తమ మిత్రులతో కనెక్ట్ కావడానికి ఉపయోగపడే విధంగా రూపొందించారు. పిల్లల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ మెసెంజర్ కిడ్స్ యాప్ ను ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. మరో వారం రోజుల తరువాత దాన్ని గూగుల్ ప్లే స్టోర్‌నుంచి డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్నితీసుకువస్తామని ఫేస్‌బుక్ వెల్లడించింది.
తల్లిదండ్రుల పర్యవేక్షణలో పనిచేసే ఈ మెసెంజర్ యాప్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో ఎడ్యుకేషన్ కు సంబంధించిన సందేహాలు తీర్చుకోవచ్చు. పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్ కావడం మాత్రమే కాకుండా ఇతర కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుంది. ఇకెందుకు ఆలస్యం ఇప్పుడే కిడ్స్ మెసెంజర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి.