బ్రేకప్‌ సమయంలో స్త్రీల కంటే పురుషులు ఎక్కువ నొప్పిని అనుభవిస్తారట.. ఎందుకో తెలుసా..?

Emotional Pain: మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రాచీన కాలం నుంచి స్త్రీలు ఎక్కువ భావోద్వేగాలు కలిగి ఉంటారని బోధిస్తుంది

Update: 2021-11-09 16:00 GMT

బ్రేకప్‌ సమయంలో స్త్రీల కంటే పురుషులు ఎక్కువ నొప్పిని అనుభవిస్తారట (ఫైల్ ఇమేజ్)

Emotional Pain: మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రాచీన కాలం నుంచి స్త్రీలు ఎక్కువ భావోద్వేగాలు కలిగి ఉంటారని, అంతేకాకుండా సున్నితత్వంతో ఉంటారని బోధిస్తుంది. అంతేకాకుండా వారు ఎక్కువ నొప్పిని తట్టుకునే శక్తి ఉంటుందని కూడా చెప్పారు. మనం ఎప్పుడైనా సినిమాలు చూసినా మనకు ఇదే కనిపిస్తుంది. తల్లి ఎప్పుడు ఏడవడం, తండ్రి క్యారెక్టర్‌ని బలంగా చూపుతారు. అలాగే హీరోయిన్‌ క్యారెక్టర్‌ సున్నితంగా, ఉద్వేగ భరితంగా చూపిస్తారు కానీ హీరో క్యారెక్టర్ ధైర్యంగా, బలవంతుడిగా, కఠినంగా చూపిస్తారు. ఇది ఒక మూస ధోరణి. కానీ ఇప్పుడు ప్రపంచం అలా లేదు. అన్నీ మారిపోయాయి. కొత్త అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

ఇటీవల లాంకాస్టర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం బ్రేకప్‌ అయినప్పుడు స్త్రీల కంటే పురుషులు ఎక్కువ బాధను అనుభవిస్తారని తేలింది. మహిళలు తక్కువ సమయంలో ఆ సమస్య నుంచి కోలుకుంటారు కానీ పురుషులు ఎక్కువ కాలం మానసిక క్షోభతో జీవిస్తారు. దాని నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. బంధం విడిపోయిన సమయంలో అతను తీవ్ర నిరాశకు గురవుతాడు కాబట్టి పురుషులకు బ్రేకప్‌తో ఎలాంటి సమస్య ఉండదనేది వాస్తవం కాదు. ఈ అధ్యయనంలో మనస్తత్వవేత్తలు సంబంధాలలో సమస్యలను గుర్తించడం, కౌన్సెలింగ్, చికిత్స ప్రారంభించడంలో మహిళలు మరింత అభివృద్ధి చెందుతున్నారని కనుగొన్నారు.

అయితే పురుషులు సంబంధంలో ఎక్కువ ఇబ్బందిని అనుభవిస్తారు. పురుషులు ఎక్కువ నొప్పిని అనుభవించడానికి కారణం వారి భావవ్యక్తీకరణ లేకపోవడమే అని మనస్తత్వవేత్తలు చెప్పారు. వారు తమను తాము బహిరంగంగా వ్యక్తీకరించలేకపోవడం వల్ల వారు మరింత బాధను అనుభవిస్తారని తేలింది. మన మెదడు ఎడమ వైపున ఉన్న హైపోథాలమస్, కనెక్షన్ అటాచ్మెంట్ అనుభూతిని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ హార్మోన్ మొత్తం మగ, ఆడ ఇద్దరిలో అంటే తల్లి, తండ్రిలో సమానంగా ఉందని వైద్యులు కనుగొన్నారు. అంటే, పిల్లల పుట్టుకతో ప్రత్యక్ష శారీరక సంబంధం లేకపోయినా, స్త్రీ శరీరంలో వలె, ప్రేమ, అనుబంధాన్ని అనుభవించే అదే హార్మోన్లు పురుషుడి శరీరం లోపల విడుదలవుతున్నాయని కనుగొన్నారు.

Tags:    

Similar News