Women gain Weight after Marriage: పెళ్లైన తరువాత మహిళలు ఎందుకు లావు అవుతారు? అసలు కారణమేమిటి?
Women gain Weight after Marriage:పెళ్లైన తరువాత చాలా మంది మహిళల్లో చాలా మార్పులు వస్తుంటాయి . ముఖ్యంగా ఆడవాళ్లలో చోటు చేసుకునే మొదటి మార్పు.. బరువు పెరగడం.లేదా లావు కావడం
Women gain Weight after Marriage: పెళ్లైన తరువాత చాలా మంది మహిళల్లో చాలా మార్పులు వస్తుంటాయి . ముఖ్యంగా ఆడవాళ్లలో చోటు చేసుకునే మొదటి మార్పు.. బరువు పెరగడం.లేదా లావు కావడం. ఇది సహజమైనప్పటికీ.. ఈ సమస్యపై చాలా మంది చాలా అపోహాలు పెట్టుకుంటారు. మగవారు బరువు పెరగడం ఎంత సహజమో.. స్త్రీలు బరువు పెరగడం కూడా అంతే సహజం. పెళ్లి తరువాత దంపతులు శారీరంగా కలవడమేనని అదే ప్రధాన కారణమని అందరూ అనుకున్నారు. కానీ ఇది పాక్షిక సత్యం మాత్రమే.. ఈ జీవన ప్రయానంలో ఇదొక భాగం మాత్రమే..అసలు పెళ్లైన తరువాత అమ్మాయి లావు అవడానికి కారణమేమిటి? ఓ సారి తెలుసుకుందాం..
ఆహార అలవాట్లలో మార్పు: పెళ్లి తరువాత తీసుకునే ఆహారమే కాదు, ఆహారం తీసుకునే టైంలో మార్పు రావడం.. అలాగే పుట్టింటి ఆహార అలవాట్లకు మెట్టింటి ఆహారపు అలవాట్లలలో మార్పు రావడం. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడూ జంక్ ఫుడ్ తీసుకోవడం. పెళ్ళైన కొత్తలో ప్రతి జంట ఒకరికొకరు తమ వంట నైపుణ్యాలను ప్రదదర్శిస్తూ ఉంటారు. ఇది కూడా బరువు పెరగటానికి మరో ముఖ్య కారణం. భార్యలు రుచికరమైన వంటలు వండుతారు.ఆ సమయంలో తీపి, అధిక కేలరీలు, కొవ్వు పదార్ధాలు తినడం వల్ల కావొచ్చు. అవి ఇద్దరూ తింటారు. ఇది శరీరంలోని అన్ని ప్రదేశాలలో అనవసరమైన ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణం అవుతుంది. దీని వల్ల త్వరగా బరువు పెరుగుతారు.
ఒత్తిడి: సాధారణంగా పెళ్ళైన తరువాత ఒత్తిడి పెరగడం. ఇరువురి మధ్య గొడవల కారణంగా భావోద్వేగానికి గురై ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
ఫిట్ నెస్: చాలా మంది ఆడవాళ్లు పెళ్ళైన తరువాత ఫిట్ గా ఉండటానికి చేసే కసరత్తులు ఆపేస్తారు. వివాహం చేసుకున్న జంటలతో పోల్చితే అవివాహితులు తమ ఫిట్ నెస్ సమస్యలను మరింత తీవ్రంగా తీసుకుంటారు. పెళ్లి అయిన తర్వాత ఫిట్ గా ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపరు. కఠినమైన వ్యాయామాలు చేయటానికి ఇష్టపడరు. అంతేకాక, సంతోషకరమైన, సంతృప్తికరమైన సంబంధంలో ఉన్న జంటలు కూడా ఎక్కువ బరువును పెరిగే అవకాశం ఉంది.
గర్భధారణ: వివాహం తర్వాత మహిళలు బరువు పెరగడానికి మరో ప్రధాన కారణం గర్భధారణ. కడుపులో బిడ్డ పెరుగుతూ ఉండటం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఈ సమయంలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, యుట్రస్, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ వల్ల బరువు పెరుగుతారు. ఆ సమయంలో వచ్చే ఆహార కోరికలు, హార్మోన్స్ ఇన్‌బాలన్స్ కారణంగా మహిళలు ఎక్కువ బరువు పెరుగుతారు. అలాగే మహిళలు గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో పౌష్టికహారం తీసుకోవడం మరో కారణం.
విశ్రాంతి: పెళ్లి అయిన తర్వాత చాలా మంది రెస్ట్ తీసుకునేందుకు ఇష్టపడతారు. ఇది బాడీలో ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది, ఈ బరువు పెరగడానికి కారణం అవుతుంది.
జీవనశైలి: వివాహం తర్వాత వ్యక్తిగత జీవితం పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా జీవనశైలిలో చాలా మార్పులు జరుగుతాయి. కొత్త బరువు, బాధ్యతలు పెరగడం. వివాహం తర్వాత జీవనశైలిలో మార్పులు ముందులా జీవించడానికి అనుకూలంగా అనుసరించడానికి సమయం ఉండక పోవచ్చు.
ఇలా అనేక కారణాలు ఉన్నాయి. మీరు వివాహం తర్వాత బరువు పెరగడానికి.. ఇలా కాకుండా మీ బరువు కంట్రోల్‌లో ఉండాలంటే ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకుని దానిని సరి చేసుకోండి..