క్వీన్ ఎలిజబెత్ కంటే కింగ్ చార్లెస్ ధనవంతుడు : అతని సంపద ఎంతో తెలుసా?

దివంగత ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ -2 కంటే ఆమె తనయుడు ప్రిన్స్ చార్లెస్ -3 అత్యంత ధనవంతుడని తేలింది. ఈ విషయాన్ని ది సండే టైమ్స్ మే 17న ప్రకటించింది.

Update: 2024-05-18 13:20 GMT

క్వీన్ ఎలిజబెత్ కంటే కింగ్ చార్లెస్ ధనవంతుడు: అతని సంపద ఎంతో తెలుసా?

దివంగత ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ -2 కంటే ఆమె తనయుడు ప్రిన్స్ చార్లెస్ -3 అత్యంత ధనవంతుడని తేలింది. ఈ విషయాన్ని ది సండే టైమ్స్ మే 17న ప్రకటించింది. ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ విశ్లేషణ ప్రకారంగా గత ఏడాది ప్రిన్స్ చార్లెస్ సంపద 10 మిలియన్ యూరోలు పెరిగింది. దీంతో ఆయన సంపద 610 మిలియన్ యూరోలకు చేరుకుందని కథనం వివరించింది.

2022 సెప్టెంబర్ లో ఎలిజబెత్ మరణించారు. ఆమె మరణించే సమయానికి ఆమెకు 486 మిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద ఉంది. అప్పటికే తల్లి కంటే చార్లెస్ సంపద 270 మిలియన్ డాలర్లు ఎక్కువ. చార్లెస్ ఆదాయంలో ప్రధానంగా డచీ కోర్న్ వాల్ పదేళ్లలో 42.6 శాతం పెరిగినట్టుగా సండే టైమ్స్ తెలిపింది.

క్రౌన్ ఎస్టేట్, డచీ ఆఫ్ లాంకాస్టర్ లేదా క్రౌన్ జ్యువెల్స్ ను మినహాయించి ఈ సంపద విలువ కట్టారు.క్రౌన్ ఎస్టేట్, క్రౌన్ జ్యువెల్స్ ను ప్రిన్స్ చార్లెస్ దేశ అవసరాలకు ఉంచారు.ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గా పనిచేస్తున్న సమయంలో డచీ కోర్న్ వాల్ నుండి చార్లెస్ 23 మిలియన్ల ఆదాయాన్ని పొందాడు.

1996లో ప్రిన్స్ చార్లెస్ డయానాకు 21 మిలియన్ డాలర్లు పరిహరం చెల్లించి విడాకులు తీసుకున్నారు. అయితే డచీ కోర్న్ వాల్ నుండి వచ్చే ఆదాయాన్ని ఆదా చేయడం ద్వారా తన సంపదను ప్రిన్స్ తిరిగి పునరుద్దరించుకున్నాడని రాజు మాజీ సలహాదారు వెల్లడించారు.

ది సండే టైమ్స్ ప్రకటించిన రిచెస్ట్ లిస్ట్ జాబితాలో గోపి హిందూజ ఫ్యామిలీ 46.2 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. 36.3 బిలియన్ డాలర్ల సంపదతో ఆ తర్వాతి స్థానంలో సర్ లియోనార్డ్ బ్లవంతనిక్ నిలిచారు.మూడో స్థానంలో డేవిడ్, సిమాన్ రూబెన్ ఫ్యామిలీ నిలిచింది.

Tags:    

Similar News