Viral: నెలకు రూ. 10 లక్షలు సంపాదిస్తున్న లారీ డ్రైవర్.. ఎలాగో తెలుసా.?
Rajesh Rawani: సాధారణంగా ఒక లారీ డ్రైవర్ నెలకు ఎంత సంపాదిస్తారు.? నెలకు రూ. 50 వేలుల, మహా అయితే రూ. లక్ష అంటారా.?
Rajesh Rawani: సాధారణంగా ఒక లారీ డ్రైవర్ నెలకు ఎంత సంపాదిస్తారు.? నెలకు రూ. 50 వేలుల, మహా అయితే రూ. లక్ష అంటారా.? అయితే ఓ లారీ డ్రైవర్ మాత్రం నెలకు ఏకంగా రూ. 10 లక్షలు సంపాదిస్తున్నాడు. ఓ సాదాసీదా లారీ డ్రైవర్ నెలకు రూ. 10 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడు. ఇంతకీ అతను ఏం చేస్తున్నాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ప్రతీ మనిషిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. అది బయటకు వచ్చిన రోజు డబ్బులు వాటంతటవే వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ట్యాలెంట్‌ను మన పక్కన ఉన్న వారు గుర్తిస్తారు. ఇలాగే ఝార్ఖండ్ చెందిన డైనమేట్ రాజేశ్ రవానీ అనే లారీ డ్రైవర్ ట్యాలెంట్‌ను అతని కొడుకు గుర్తించాడు. రాజేశ్ ఎన్నో ఏళ్ల నుంచి లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. దేశమంతా తిరుగుతూ సరుకులు దించుతూ బతుకు జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రయాణంలో తాను స్వయంగా వంట చేసుకుంటూ, భోజనం చేస్తూ ముందుకు సాగుతుంటాడు.
అయితే ఇదే క్రమంలో ఓసారి చికెన్ వంట చేస్తూ, డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉండే కష్టసుఖాలను వివరిస్తూ ఫోన్‌లో ఓ వీడియో రికార్డ్ చేశాడు. ఇది గమనించిన రాజేశ్ కొడుకు.. తన నాన్న మాటల్లో ఏదో మ్యాజిక్ ఉందని, ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అంతే వీడియోను కాస్త ఎడిటింగ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. లక్షలాది మంది వీడియోను వీక్షించారు. అదే స్థాయిలో సబ్‌స్క్రైబర్ల సంఖ్య సైతం శరవేగంగా పెరిగింది.
ఇంకేముంది.. చేసే వంటలతో పాటు, ప్రయాణ సమయంలో ఎన్నో విషయాలను పంచుకుంటూ ముందుకుసాగాడు. 'ఆర్ రాజేశ్ వ్లాగ్స్' పేరుతో యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఒక్కో వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇక యూట్యూబ్ నుంచి గట్టిగానే ఆర్జిస్తున్నాడు రాజేశ్. సుమారు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు నెలకే ఆదాయం వస్తోంది. లక్షల్లో డబ్బులు, మరోవైపు తనకు ఇష్టమైన డ్రైవింగ్ వృత్తిని కొనసాగిస్తూ.. రాజేశ్ లైఫ్ రయ్యి రయ్యిమంటూ దూసుకుపోతోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాజేశ్ ఈ విషయాలన్నింటినీ పంచుకున్నాడు.