Railway Rules: ఇలాంటి టిక్కెట్‌తో రైలులో జర్నీ చేస్తున్నారా.. రూల్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Railway Rules: ఇలాంటి టిక్కెట్‌తో రైలులో జర్నీ చేస్తున్నారా.. రూల్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Railway Rules For Waiting Ticket: రిజర్వేషన్ విండో నుంచి తీసుకున్న టికెట్ వెయిటింగ్‌లోకి వెళితే.. ఆ వెయిటింగ్ టికెట్‌పై రైలులో ప్రయాణించవచ్చా? దీని కోసం రైల్వే నిబంధనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతీయ రైల్వేలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇందుకోసం భారతీయ రైల్వే వేలాది ప్యాసింజర్ రైళ్లను నడుపుతోంది.
ప్రయాణీకులు తమ సౌకర్యార్థం రైలులో రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఇది వారి ప్రయాణాన్ని చాలా సౌకర్యవంతంగా చేస్తుంది.
రైల్వేలో రిజర్వేషన్ కోసం ఎన్నో ఎంపికలు ఉన్నాయి. మీకు కావాలంటే, మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ కోసం, మీరు రైల్వే టిక్కెట్ బుకింగ్ విండోకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.
కానీ, చాలా సార్లు రిజర్వేషన్ తర్వాత టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్తాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వెయిటింగ్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది.
కానీ, రిజర్వేషన్ విండో ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లు రద్దు కావు. అందుకే రిజర్వేషన్ కౌంటర్ నుంచి తీసుకున్న టికెట్లు లేదా ఆన్‌లైన్ నుంచి తీసుకున్న టికెట్లు వెయిటింగ్ లిస్టులోకి వెళ్తే.. రైలులో ప్రయాణించవచ్చని జనం నమ్ముతుంటారు. అయితే, ఇది ఎంత వరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా.. ఇది నేరంగా పరిగణిస్తుంటారు. రైల్వే నిబంధనల ప్రకారం, వెయిటింగ్ టిక్కెట్‌ను కౌంటర్ నుంచి తీసుకున్నా లేదా ఆన్‌లైన్‌లో తీసుకున్నా.. వాటితో ప్రయాణించలేరు. ఇలా చేస్తే, TTE మీపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.