మీ టికెట్ RSWL, CKWL లిస్టులో ఉందా.. వీటి అర్థమేంటో తెలుసా.. వీటిలో ఏ టికెట్ కన్ఫర్మ్ అవుతుందంటే?
Railway Waiting List Tickets: భారతీయ రైల్వేలలో, టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అది వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళుతుంది. రైల్వేలో మొత్తం ఏడు రకాల వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నాయి. GNWL, RLWL, PQWL, RLGN, RSWL వంటి కోడ్ పేర్లు వీటికి కేటాయించారు.
Railway Waiting List Tickets: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ దాదాపు 2.5 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణికుల సంఖ్య ఆస్ట్రేలియా లాంటి దేశ జనాభాకు సమానం. రైలులో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రయాణించడానికి ఇష్టపడుతుంటారు. రిజర్వేషన్ AC కోచ్ లేదా స్లీపర్ కోచ్‌లో ప్రయాణీకులు చాలా సౌకర్యాలను పొందుతారు.
దీంతో వారి ప్రయాణం కూడా చాలా సులభం అవుతుంది. అయితే టిక్కెట్ల కోసం చాలా డిమాండ్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో, రిజర్వేషన్ చేసిన తర్వాత, మీరు వెయిటింగ్ లిస్ట్‌లో టిక్కెట్ పొందుతారు. రైల్వేలో అనేక రకాల వెయిటింగ్ టికెట్లు ఉన్నాయి. ఇందులో RSWL, CKWL కూడా ఉన్నాయి. ఈ వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లలో ఏవి కన్ఫర్మ్ అవుతాయి, ఏవి కావు? వాటి నియమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
RSWL వెయిటింగ్ లిస్ట్ అంటే ఏమిటి?
భారతీయ రైల్వేలో ఒక ప్రయాణీకుడు టికెట్ బుక్ చేసినప్పుడు వాళ్లకు టికెట్ కన్ఫర్మ్ కాదు. దీంతో ఆ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్లిపోతుంది. రైల్వేలో మొత్తం ఏడు రకాల వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నాయి. GNWL, RLWL, PQWL, RLGN, RSWL వంటి కోడ్ పేర్లు వీటికి కేటాయించారు. మీరు టిక్కెట్‌ను బుక్ చేసి, మీ టికెట్ RSWL వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
RSWL వెయిటింగ్ లిస్ట్ అంటే రోడ్ సైడ్ వెయిటింగ్ లిస్ట్. ప్రయాణీకుడు టికెట్ బుక్ చేసే సమయంలో.. ఆ రైలు ప్రారంభ స్టేషన్ నుంచి బుకింగ్ చేసినప్పుడు, అంటే రైలు బయలుదేరిన స్థలం చుట్టూ ఉన్న రోడ్‌సైడ్ స్టేషన్‌లు అన్నమాట. అప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ ఇస్తుంటారు. అయితే, ఇలాంటి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.
CKWL వెయిటింగ్ లిస్ట్ అంటే ఏమిటి?
భారతీయ రైల్వేలలో రిజర్వేషన్‌లో ప్రజలు సాధారణంగా ధృవీకరించబడిన టిక్కెట్‌లను పొందనప్పుడు.. ఎక్కువమంది తత్కాల్ కోటాను ఉపయోగించి టిక్కెట్లు బుక్ చేస్తారు. అయితే, తత్కాల్ కోటాలో టిక్కెట్లు బుక్ చేసుకున్నా కూడా టికెట్ కన్ఫర్మ్ అవ్వదు. కాబట్టి అక్కడ కూడా వాళ్లకు వెయింటింగ్ లిస్ట్ కేటాయిస్తుంటారు.
అటువంటి పరిస్థితిలో CKWL వెయిటింగ్ లిస్ట్ ఇస్తారు. CKWL అనేది వెయిటింగ్ లిస్ట్‌లోని తత్కాల్ కోటా కోడ్. CKWL అంటే తత్కాల్ వెయిటింగ్ లిస్ట్‌లో, టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.