Relationship News: అమ్మాయిలకు నచ్చాలంటే అబ్బాయిలు ఈ పనులు చేయొద్దు..!
Relationship News: రోజుల్లో భార్యాభర్తలైనా, ప్రేమికులైనా చిన్నచిన్న తప్పులకే విడిపోతున్నారు.బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు
Relationship News: రోజుల్లో భార్యాభర్తలైనా, ప్రేమికులైనా చిన్నచిన్న తప్పులకే విడిపోతున్నారు.బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. నిజానికి ప్రేమల పడిన కొత్తలో అయినా పెళ్లైన కొత్తలో అయినా ఇద్దరికి ఒకరంటే ఒకరికి గౌరవం, ప్రేమ, అప్యాయత ఉంటాయి. రోజులు గడిచిన కొద్దీ ఒకరి గురించి మరొకరికి తెలియడంతో గొడవలు ప్రారంభమవుతాయి. ఈ విషయంలో అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించిన కొన్ని పనులను అంగీకరించరు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలవుతాయి. అమ్మాయిలకు నచ్చాలంటే అబ్బాయిలు ఈ అలవాట్లను వదిలేయకతప్పదు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
అనుమానం
పెళ్లైనా, ప్రేమయినా అది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఒరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. లేదంటే రిలేషన్ షిప్ ఎక్కువ కాలం కొనసాగించడం కష్టం. మీరు కారణం లేకుండా అమ్మాయిని అనుమానించినట్లయితే ఆమె మీకు బై బై చెబుతుంది. అందువల్ల వారి ఫోన్‌ను చెక్ చేయడం, స్నేహితులను కలిసినప్పుడు అనుమానించడం, లైవ్ లోకోషన్ షేర్ చేయమని అడగడం లాంటివి చేయమని పట్టుబట్టవద్దు. ఎందుకంటే ఈ ప్రవర్తన వల్ల వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు.
కమ్యూనికేషన్ గ్యాప్
మీరు ఒకే ఇంట్లో లేదా వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్నా మీ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అబ్బాయిలు తమ పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అమ్మాయిలతో మాట్లాడటానికి లేదా వారి యోగక్షేమాలను అడగడానికి కొంత సమయం కేటాయించుకోవాలి. సుదూరంగా ఉంటే మాట్లాడటం మరింత ముఖ్యమైనది. లేదంటే వారు మిమ్మల్ని అపార్థం చేసుకొని వదిలిపెట్టి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి.
అబద్ధం
అబద్ధం జీవితాలను నాశనం చేస్తుంది. తమ భాగస్వామి తమతో అబద్ధాలు చెప్పడం అమ్మాయిలకు ఇష్టం ఉండదు. అది రిలేషన్ షిప్ ను దెబ్బతీస్తుంది. దీన్ని నివారించడానికి సంబంధంలో నమ్మకంగా ఉండడం అవసరం. మీరు మీ స్నేహితుడిని కలవబోతున్నట్లయితే, ఆర్థికపరమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, మీ ఉద్యోగాన్ని మార్చబోతున్నట్లయితే, మీ భాగస్వామి దగ్గర దాచవద్దు. ఎందుకంటే ఈ విషయాలు తర్వాత తెలిస్తే పెద్ద గొడవలు జరగవచ్చు.
చెడు అలవాట్లు
మీరు సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకుంటే ఈ అలవాట్లు అమ్మాయిలకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆమె తన భవిష్యత్ ను మీతో ఊహించుకోలేకపోవచ్చు. మీరు మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం వల్ల జీవిత భాగస్వామితో తప్పుగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ అలవాట్లను వదులుకోవడం ఉత్తమం.