Indian Railway: ఈ ట్రైన్ ట్రాక్ ఎక్కితే.. రాజధాని నుంచి వందే భారత్ వరకు.. దారి ఇవ్వాల్సిందే.. భారత్‌లో హై ప్రయారిటీ టైన్ ఏంటో తెలుసా?
Indian Railway: భారతదేశంలోని అగ్రశ్రేణి రైళ్లలో రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కానీ, ఈ రైళ్ల కంటే కూడా కొన్ని రైళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.
High Priority Trains: భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం అనేక రకాల రైళ్లను నడుపుతున్నాయి. రైల్వేలు ప్రతి వర్గం ప్రయాణికుల కోసం బడ్జెట్ రైళ్లను నడిపిస్తుంటాయి. మాములుగా ఒక రైలులో ప్రయాణిస్తున్న సమయంలో, మరొక రైలుకు క్రాసింగ్ ఇవ్వడం కోసం ఆపేస్తుంటారు. రైళ్లను వారి కేటగిరీ ప్రకారం ట్రాక్‌పై నడపడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అధిక ప్రాధాన్యత కలిగిన రైళ్లు ముందుగా వెళ్లేందుకు అనుమతిస్తుంటారు. శతాబ్ది లేదా రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లు కూడా ఇండియన్ రైల్వే నడిపిస్తోంది. ఇవే కాక భారతీయ రైల్వేలో ఒక ప్రత్యేక రైలు కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని టాప్ కేటగిరీ రైళ్లలో రాజధాని, శతాబ్ది ఉన్నాయి ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఈ కేటగిరీలో చేర్చారు. రాజధాని రైళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో నడిచే కొన్ని రైళ్లు ట్రాక్‌పైకి వచ్చినప్పుడు, రాజధానిని కూడా ఆపి, ముందుగా వీటిని వెళ్లడానికి అనుమతిస్తారు.
యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ ట్రైన్ (ARME)..
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద స్థలానికి వైద్య సహాయం అందించేందుకు ఈ రైలును నడుపుతారు. అన్ని రైళ్ల కంటే ఈ రైలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రాజధాని లేదా శతాబ్ది వంటి రైళ్లు ముందు వెళ్తుంటే, అప్పుడు వాటిని ఆపివేసి, ముందుగా ఈ ట్రైన్‌కు దారి ఇస్తుంటారు. ఈ సందర్భంలో, ARME భారతీయ రైల్వేలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రైలుగా పేరుగాచింది.
అధ్యక్ష రైలు..
రాష్ట్రపతి రైలుకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఇప్పుడు రాష్ట్రపతి ఎక్కువగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ రైలు ఆపరేషన్ చాలా అరుదుగా జరుగుతోంది.
రాజధాని, శతాబ్ది..
మామూలు రోజుల్లో నడిచే హై ప్రయారిటీ రైళ్ల గురించి మాట్లాడితే, రాజధాని ఎక్స్‌ప్రెస్ పేరు అగ్రస్థానంలో వస్తుంది. ఈ రైలు సరైన సమయానికి చేరుకోవడానికి ప్రసిద్ధి చెందింది. దీని తర్వాత శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు అధిక ప్రాధాన్యత కలిగిన రైలుగా పేరుగాంచింది. ఇది భారతదేశంలోని సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఇది ఒకే రోజులోనే తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.
దురంతో, గరీబ్ రథ్..
వీటి తరువాత, దురంతో ఎక్స్‌ప్రెస్, తరువాత గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ అధిక ప్రాధాన్యత గల రైళ్ల జాబితాలోకి వస్తాయి. గరీబ్ రథ్ రైలు ప్రాధాన్యత క్రమంలో ఏడవ స్థానంలో ఉంది.