International Friendship Day 2020: స్నేహం అనేది దేవుడిచ్చిన గొప్పవరం

Update: 2020-07-30 06:20 GMT

International Friendship Day 2020: స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా అనే పాట వినే ఉంటారు. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. ఎందుకంటే ఎదుటి వాడిలో ఉండే లోపాన్ని, కోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. ఆస్తి, అంతస్తు, కులంతో సంబంధం లేకుండా పుట్టేదే స్నేహం. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. తప్పు చేసినప్పుడు మందిలించి సంరక్షునిలా రక్షిస్తూ వారికి దారి చూపే వాడే నిజమైన స్నేహితుడు. స్నేహితులు అనే వారు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకుని ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అందుకేనేమో ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను, సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించుకుంటారు.

ఇలాంటి స్నేహితుల కోసం ఓ రోజు ఉంది. అదే స్నేహితుల దినోత్సవం. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం నేడు. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన ఒక గొప్పవరం. ఈ వరం గొప్పదనం గురించి మనం ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా చెప్పిన తరగదు. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను పంచే ఏకైక పదం స్నేహం. అందుకే ఇలాంటి గొప్ప వరాన్ని సంపాదించి దాన్ని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. ప్రతీరోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. తాము కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది.

స్నేహితుల దినోత్సవం ఏ దేశంలో ఎప్పుడు జరుపుకుంటారు..

నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్‌ వ్యూహాలతో మొదలైంది. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అంతే కాదు హాల్‌మార్క్‌ గ్రీటింగ్‌ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్‌ హాల్‌ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. అందుకు తగ్గట్లు కొన్ని గ్రీటింగ్‌ కార్డులు మార్కెట్లోకి పంపారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. 1997 లో యునైటెడ్ నేషన్స్ "స్నేహం" యొక్క ప్రపంచ అంబాసిడర్ "విన్నీ ది పూః". నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి.

ఇక వరల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌ క్రూసేడ్‌ అనే సంస్థ 1958లో పరాగ్వేలో జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు కూడా దీన్ని పాటించడం మొదలుపెట్టాయి. 2011లో ఐక్యరాజ్యసమితి కూడా ఈ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20వ తేదీన నిర్వహిస్తారు. అయితే భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్‌ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. పాకిస్థాన్‌లో మాత్రం జూలై 30వ తేదీన చేసుకుంటారు. ఇంగ్లీష్ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన 'విన్నీ ది పూహ్‌' కార్టూన్‌ క్యారెక్టర్‌ టెడ్డీబేర్‌ను స్నేహానికి ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ భార్య నానె అన్నన్‌ 1998లో ప్రకటించారు.

అమెరికా

ప్రపంచ ఫ్రెండ్షిప్ డే మసాచుసెట్స్, ఓహియో,, అప్పుడప్పుడు న్యూ హాంప్షైర్ యొక్క పాకెట్స్ యునైటెడ్ స్టేట్స్ లో జూన్ 30 న ఒక జరుపుకుంటారు.

బ్రెజిల్

బ్రెజిల్ స్నేహితుల దినోత్సవాన్ని ఏప్రిల్ 18 న జరుపుకుంటారు.



Tags:    

Similar News