ganesh chaturthi 2020: వినాయక చవితి కథ.. మన జీవితాలకు మేలుకొలుపు!
ganesh chaturthi 2020: వినాయకచవితి కథలో మానవాళికి అందే సందేశం
వినాయకచవితి అంటే మన లోగిళ్ళలో ఉండే సందడి వేరు. వినాయకుడు ఆది దేవుడే కాదు అయన కథలోనే మానవుడు ఎలా ఉండాలో అంతర్లీనంగా చెబుతారు. అసలు వినాయకుని కథ అందరికీ తెలిసినా మరోసారి తెలుసుకుందాం. కథలోని ముఖ్య భాగాలలో మనకి ఆయా భాగాలు ఏరకమైన సందేశాన్ని ఇస్తున్నాయో చెప్పుకుందాం.
పూర్వం గజాననుడు అనే రాక్షనుడు శివుని కోసం ఘోర తవస్సు చేసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులోనే ఉండిపోవాలన్న కోరికను కోరి కడుపులోనే మహశివుడిని దాచుకుంటాడు. కోన్ని రోజులకు ఈ విషయాన్నితెలునుకున్న పార్వతీ దేవి శ్రిమహావిష్ణువు నహాయం కోరగా ఆయన బ్రహ్మ సాయంతో, నందిని తీసుకొని గంగింద్దులను ఆడించేవారిగా వెళ్లి గంగిరెద్దును గజాననుడి ముందు ఆడిస్తారు. దానికి తన్మయత్యం చెందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు. దాంతో విష్ణుమూర్తి శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా... తన దగ్గరకు వచ్చింది సాక్షాతూ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకున్న గజాసురుడు నందిశ్వరుడిని తన పొట్ట చీల్చమని.. ఈశ్వరుడు బయటకు బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించేల చేయమని విష్ణువును కోరి మరణిస్తాడు. (ఎంత ఇష్టమైనదైనా అత్యాశగా దగ్గరే ఉంచేసుకోవాలని ప్రయత్నిస్తే భంగపాటు తప్పదనేది ఈ భాగం చెబుతుంది)
శివుడి రాక గురింఛి విన్న పార్వతీ దేవి సంతోశించినదై, భర్త కోసం అందంగా సిద్ధమయ్యేందుకు నలుగు పట్టుకుంటూ ఆ నలుగు పపిండితో ఓ బాలుడి రూపాన్ని తయారుచేసి దానికి
ప్రాణం పొసి ద్వారం వద్ద నిలబబెట్టి ఎవరినీ రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళుతుంది. ఈ సమయంలో అక్కడకు వచ్చిన పరమ శివుడ్ని ఆ బాలుడు లోనికి వెళ్ళకుండా అడ్డుకుంటాడు. దీంతో ఆయన కోపంతో బిడ్డ శిరన్సును ఖండించి లోపటికి వెళతాడు. అవ్పటిక స్నానం ముగించుకొని అలంకరించుకున్న పార్వతీ దేవి భర్తను చూసి సంతోషించి ఆయనతో మాట్లాడింది. కాసేపటికి బయట ఉన్న బాలుడి ప్రస్తావన రాగా శివుడికి అతడు తమ బిడ్డ అని పార్వతీ దేవి చెబుతుంది. శిపుడు బాధతో గజాసురిడి తలను ఆ పిల్లవాడికి అతికించి బ్రతికిస్తాడు. గజ ముఖం ఉండడం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు పొందాడు. (అతి కోపం కొంప మున్చుతుందనీ.. అదేవిధంగా కర్తవ్య నిర్వహణలో కష్టం వచ్చినా నిబద్ధతతో ఉంటె మేలు జరుగుతుందనీ ఈ ఉదంతం చెబుతుంది. శివుని కోపం కారణంగా ఒక పిల్లవాడు అకారణంగా మరణించాడు. అదే పిల్లవాడు పార్వతీదేవి తనకు చెప్పిన పనిని కచ్చితంగా చేయడం వలెనే శివునికి కోపం తెప్పించినా కర్తవ్య నిర్వహణలో ఆ బాలుని లక్షణాన్ని మెచ్చిన శివుడు అతడిని గణనాధుడిని చేశాడు)
ఇన్ని రోజుల తర్వాత దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు విఘ్నం రాకుండా ఉండేందుకు కొలవడానికి ఒక దేవుడిని ప్రసాదించమని కోరగా ఆ పదవికి గజాననుడు. కుమార స్వామి ఇద్దరూ పొటీ పడతారు. ముల్లోకాల్లోని పుణ్య నదులన్నింటిలో స్నానం చేసి మొదట వచ్చిన వారే ఈ పదవికి అర్హులవుతారని శివుడు చెబుతాడు. దాంతో కుమారస్వామి తన వాహనమైన నెమలి ఎక్కి వేగంగా వెళ్ళిపోతాడు. గజాననుడు మాత్రం తన వాహనమైన ఎలుకతో ఎలా ముల్లోకాలు తిరగాగాలను.. నా బలహీనత తెలిసే ఈ పరీక్ష పెట్టారా అని శివుడ్ని అడుగుతాడు. తరువాత తన తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షణ చేస్తారు. ఈయన ఇక్కడ ప్రదక్షణలు చేస్తుంటే ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా కుమారా స్వామికి వినాయకుడు తనకన్నా ముందు అక్కడ నుంచి వేలుతుండడం కనిపిస్తుంది. దాంతో తిరిగొచ్చిన కుమారస్వామి తండ్రీ అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను
మన్నించి అన్నకు ఆధిపత్యం అప్పగించండి అని చెబుతాడు. అలా భాద్రపద పద మాసం శుక్లపక్ష చవితి నాడు వినాయకుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. (బలం..వేగం కన్నా ఒక్కోసారి బుద్ధి కుశలతే అందలాన్ని అందిస్తుందని ఈ విభాగం చెబుతుంది. అంతేకాదు.. ముల్లోకాలలో తల్లిదండ్రులను మించింది ఏదీ లేదనే సత్యాన్నీ వివరిస్తుంది)
ఇక విఘ్నేశ్వరుడికి పండగ చేసి దేవతలూ మునులూ ఆరోజు కుడుములు, పాలు ,అరటి పళ్ళు, పానకం, వడపప్పు వంటి ప్రసాదాలను వినాయకునికి తినిపిస్తారు. అవన్నీ తిన్న గణేశుడు పొట్ట ఉబ్బిపోయి ఆపసోపాలు పడుతూ ఇంటికి కైలాసం పయనం అవుతాడు. అక్కడ తన తల్లిదండ్రులకు నమస్కరించడానికి వంగితే చేతులు నెలకు ఆనడానికి పొట్ట అడ్డు వచ్చింది. అది చూసిన చంద్రుడు ఫకాలున నవ్వాడు. దాంతో వినాయకుని పొట్ట పగిలిపోతుంది. అది చూసిన పార్వతీ దేవి కోపంతో చంద్రుని ఎవరూ చూడకూడదని శపిస్తుంది. విషయం తెలిసిన శ్రీమహావిష్ణువు వినాయకుని పొట్టను నాగుపాముతో బంధించి కాపాడతాడు. చంద్రుని ఎవరూ చూడకూదదంటే ముల్లోకాలూ తల్లడిల్లిపోతాయని పార్వతీదేవికి చెబుతాడు విష్ణు మూర్తి. దాంతో శాంతించిన పార్వతీ దేవి వినాయక చవితి రోజు మాత్రం చంద్రుని చూస్తె నీలాపనిందలు కలుగుతాయని శాపానికి ఉపశమనం చెబుతుంది. (కడుపు పగిలేలా తింటే అనర్ధాలు తప్పవని చెబుతుంది ఈ భాగం. అదేవిధంగా కష్టంలో ఉన్నవారిని చూసి నవ్వితే వారికి కూడా కష్టాలు తప్పవని హెచ్చరిస్తుందీ ఉదంతం.)
ఇదీ వినాయకుడి చవితి కథ. ఈ కథ ఎవరైతే విని అక్షతలు తల మీద వేసుకుంటారో వారికి చంద్రుని పొరపాటున చూడడం వలన కలిగే అనర్దాల నుంచి ఉపశమనం లభిస్తుంది.