Indian Railway: రాజధాని నుంచి శతాబ్ది వరకు.. రైళ్లకి ఈ పేర్లని ఎలా నిర్ణయిస్తారో తెలుసా..?

Indian Railway: భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. చాలా మందికి రైలు అంటే దాని పేరు ద్వారానే తెలుసు.

Update: 2022-05-20 11:30 GMT

Indian Railway: రాజధాని నుంచి శతాబ్ది వరకు.. రైళ్లకి ఈ పేర్లని ఎలా నిర్ణయిస్తారో తెలుసా..?

Indian Railway: భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. చాలా మందికి రైలు అంటే దాని పేరు ద్వారానే తెలుసు. రైలు నంబర్ల మాదిరిగానే వాటి పేర్లు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఏ రైలుకి ఎలా పేరు వచ్చిందో తెలుసుకుందాం.

రాజధాని రైలుకు ఎలా పేరు పెట్టారు.. వాస్తవానికి రాజధాని రైలు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్ర రాజధానికి కనెక్ట్ చేయడానికి ప్రారంభించారు. రాజధాని ఢిల్లీ సహా రాష్ట్రాల రాజధాని మధ్య నడుస్తుంది. ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి 'రాజధాని' రైలును ప్రారంభించారు. అందుకే దీనికి రాజధాని అని పేరు పెట్టారు.

రాజధాని రైలు వేగానికి ప్రసిద్ధి. ప్రస్తుతం దీని వేగం గంటకు 140 కి.మీ. రాజధాని భారతదేశంలో అత్యంత ఇష్టపడే రైలు. దీని వేగం ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తారు.వేగంగా నడుస్తున్న శతాబ్ది రైలు భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే రైళ్లలో ఒకటి. ఈ రైలు 400 నుంచి 800 కి.మీ. ప్రయాణిస్తుంది. శతాబ్ది వేగం గంటకు 160 కి.మీ. ఉంటుంది. ఇందులో స్లీపర్ కోచ్‌లు ఉండవు. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ మాత్రమే ఉంటాయి.

వాస్తవానికి ఈ రైలును దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 100వ పుట్టినరోజున అంటే 1989లో ప్రారంభించారు. చాచా నెహ్రూ జయంతి రోజున ప్రారంభమైనందున దీనికి 'శతాబ్ది' అని పేరు పెట్టారు. దురంతో గంటకు 140 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి తక్కువ స్టాప్‌లు ఉంటాయి. ఈ రైలు సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది. దురంతో అనే పేరు బెంగాలీ పదం నిర్బాద నుంచి వచ్చింది. దీని అర్థం 'విశ్రాంతి లేనిది'. దీని స్టేజ్‌లు కూడా తక్కువగా ఉంటాయి. రెస్ట్‌లెస్ రైలు కాబట్టి దురంతో అని పేరు పెట్టారు.

Tags:    

Similar News