Pranab Mukherjee: అస్తమించిన 'రాజకీయ భీష్ముడు' ప్రణబ్ ముఖర్జీ!
Pranab Mukherjee: చనిపోయిన వాళ్లందరూ గొప్పొలే అంటారు. చనిపోయిన , బ్రతికి ఉన్న గొప్పగా, గొప్పతనంగా జీవిస్తారు. అది కొంత మందికే సాధ్యం. అందులోనూ రాజకీయాల్లో ... రాజకీయాల్లో ఉన్నప్పుడూ విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తులు , కుయుక్తులు సాధారణం
Pranab Mukherjee: చనిపోయిన వాళ్లందరూ గొప్పొలే అంటారు. చనిపోయిన , బ్రతికి ఉన్న గొప్పగా, గొప్పతనంగా జీవిస్తారు. అది కొంత మందికే సాధ్యం. అందులోనూ రాజకీయాల్లో ... రాజకీయాల్లో ఉన్నప్పుడూ విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తులు , కుయుక్తులు సాధారణం. కానీ కొంత మంది రాజకీయ నాయకులు మాత్రం వీటికి అతీతం. వారెక్కడ ఉన్న పదవుల కోసం కాదు .. విలువల కోసం పనిచేస్తారు.
అలాగే, ఈ రోజు మన భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన తరువాత.. ఆయన గొప్పతనం గురించి ఎన్నో వింటున్నాం. ఎన్నో చెప్పుకుంటున్నాం. కానీ ఆయన చేసిన సేవలు, ఆయన సాధించిన విజయాలు, అవకాశమున్న సరే కొన్ని పదవులకు దూరంగా ఉన్న వైనం.. ఇవ్వన్ని ఆయనను ప్రత్యేకంగా నిల్చుండ బెట్టాయి. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం అనిర్వచనీయం. ఆయన కాంగ్రెస్ పార్టీకి భీష్మాచార్యుడిలా వ్యవహరించారు. భీష్మాచార్యుడు ఏవిధంగా అయితే... వెనకుంది. తానిచ్చిన మాట కోసం చివరి శ్వాస వరకు ఏవిధంగా పనిచేశాడో .. ప్రణబ్ ముఖర్జీ కూడా తన పార్టీకి విధేయుడుగా ఉంటూ.. పార్టీ సంక్షోభం సమయంలో తన బుద్ది బలంతో .. దట్టేక్కించిన ఘనత ప్రణబ్ దే.
చాలా కొద్ది మందికి మాత్రమే ప్రణబ్ ముఖర్జీ గుర్చి తెలుసు. ప్రణబ్ ముఖర్జీని సాధారణ ప్రజలు ఓ రాష్ట్రపతి గానో.. ఓ ఆర్ధిక మంత్రి గానో.. కాంగ్రెస్ సీనియర్ నేతగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఆయనతో పాటు జర్నీ చేసిన ఏ నాయకుడిని అడిగినా .. నిస్సందేహంగా ఆయన గొప్పతనం గురించే చెప్పుతారు. చుక్కాని లేని కాంగ్రెస్ పార్టీకి.. ఓ నావికుడిలా.. సోనియా గాంధీకి సలహాదారుడిగా ఉంటూ.. ప్రణబ్ ముఖర్జీ సేవలు అమోఘం. వాటిని ఏ కాంగ్రెస్ వాది మరిచిపోరు. ఒక్కవేళ ప్రణబ్ సేవలు మరిచిపోతే..వాళ్లంతా ద్రోహులెవ్వరూ ఉండరని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రణబ్ సేవలు, ఆయన రాజకీయ జీవితంలో ఏవిధంగా ఉండే వారు. ఈ విషయాలను స్పష్టంగా చర్చించుకుంటే.. చనిపోతే వారిని పొగుడుతున్నారు అనే విషయాన్ని పక్క నెట్టి..ఆయన గురించి తెలుసుకున్న వాళ్లమవుతాం.. ఆయన జీవితంలోని కొన్ని ప్రత్యేకతలకు అక్షర రూపమే ఈ వ్యాసం.
భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మనకు ఇకలేరు. ఐదు దశాబ్దాల సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన భారత ప్రభుత్వం పైన, భారత ప్రజాస్వామిక వ్యవస్థపైన, రాజకీయ వ్యవస్థపైన కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకతలు.. మనం గమనిస్తే.. మొదటిది ఆయన రాజకీయాల్లో చాలా అదురుగా కనిపించే వ్యక్తి, మేథో సంపత్తి ఆమోఘం. నిరంతర అధ్యాయనం చేసే వ్యక్తి .. కానీ ప్రస్తుత రాజకీయాల్లో వీటి కన్న ధన బలం, మంద బలం , కులం బలం ఉన్న వాళ్లే ఎదుగుతున్నారు..వాళ్లే ఎదుగుతారు కూడా. కానీ ప్రణబ్ ముఖర్జీ వాటన్నిటిని పక్కన బెట్టి బుద్ధియ బలంతో రాజకీయాల్లో ఎదిగారు. ఒక విద్యాంసుడుగా, ఒక రచయితగా, ఒక మేధావి, ఒక ఉపన్యాసకుడుగా ఆయన కూడా పేరు ప్రఖ్యాతలే.. ఆయన నలుగురు ప్రధానుల దగ్గర కీలక పదవుల్లో ఉండటానికి దోహదం చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహా రావు, మన్మోహన్ సింగ్.. అందు వల్ల ఆయన రాజకీయాల్లో అరుదైన లక్షణాలతో అరుదైన గౌరవాన్ని పొందిన అరుదైన నాయకుడు ప్రణబ్ ముఖర్జీ..
రెండవది.. రాజకీయాల్లో ఓ స్థాయికి వచ్చాక.. పదవుల పట్ల ఆకాంక్ష ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఆకాంక్షలు నేరవేరని సందర్బాలు కూడా ఉంటాయి. ఆ సమయంలో తనను తాను సర్దుబాటు చేసుకుని ..తనకు వచ్చినట్టి అవకాశాలు, తనకు ఇచ్చినట్టి బాధ్యతలను ఇబ్బందికర పరిస్థితిలోనూ సక్రమంగా నిర్వహించడం ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకత.
కాంగ్రెస్ పార్టీకి .. ప్రణబ్ ముఖర్జీకి విడదీయరాని సంబంధం ఉంది. 1984 వరకూ ఇందిరగాంధీ క్యాబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇందిరాగాంధీకి సలహాదారునిగా, అత్యంత అప్తుడుగా పని చేశారు. కానీ ఇందిరా హత్య అనంతరం.. ప్రధాన మంత్రిగా పనిచేయడానికి అవకాశం వచ్చినా.. అదృష్టం వరించలేదు. అనంతరం రాజీవ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఎవరూ ఉహించని విధంగా రాజీవ్ క్యాబినేట్ నుంచి తొలగించబడ్డారు. ఈ విషయాన్ని తన పుస్తకం లో ఇలా రాసుకున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అసలు ఉహించలేదని.. నన్ను రాజీవ్ గాంధీ క్యాబినేట్ తీసుకోరని ఉహించలేదు. ఆ తరుణంలోనే సీడబ్యూసీ నుంచి తొలగించారు. చాలా బాధకరమని రాసుకున్నారు. ఈ విధంగా ఎందుకు జరిగిందంటే.. ఇందిరా గాంధీ హత్య అనంతరం ప్రధాని కావాలని ప్రణబ్ కలలు గన్నారు. ఆకాంక్షించారు. అందుకే ఆయనను దూరం పెట్టరాని రాజకీయ వేత్తలు చెబుతారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి.. సొంత పార్టీ పెట్టారు. అనంతరం.. పలు పరిణామాలు తరువాత.. 1989 చేరారు. ఆయన మేథో సంపత్తి , ఆయన రాజకీయ అనుభవం వల్లే 1989లో మళ్లీ రాజీవ్ గాంధీ క్యాబినేట్ లోకి తీసుకున్నారు. మరో సారి రాజీవ్ గాంధీ మరణారనంతరం ప్రధాని కావడానికి అవకాశం వచ్చింది. కచ్చితంగా ప్రణబ్ ముఖర్జీనే ప్రధానిగా బాధ్యతలు చేపడుతారని రాజకీయ నిపుణులు భావించారు. కానీ అనూహ్య కారణాలతో .. పీవీ గారు ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. ఇది ఆయనకు రెండో సారి ఆశ భంగపాటు తప్పలేదు. అయినా కూడా ఆయన పీవీ క్యాబినేట్‌లో ఒదిగిపోయారు.
తరువాత మూడోసారి.. సోనియాగాంధీ ప్రధాని పదవీని తిరస్కరించడంతో ఆయన సమయంలో ప్రణబ్ ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. కానీ ఆకస్మికంగా మన్మోహన్ సింగ్ తెర మీదకు వచ్చారు. ఆయనకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. అసలు ప్రణబ్ ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో మన్మోహన్ సింగ్ ను ఆయనే ఆర్బీఐ గవర్నర్‌గా సిఫార్సు చేశారు. అలాంటి మన్మోహన్ సింగ్ క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేయవల్సి వచ్చింది. దానికి కూడా ఆయన అంగీకరించారు.
ఆయన మరో ప్రత్యేకత .. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సంక్షోభంలో ఉన్న ఆయన ట్రబుల్ షూటర్‌గా రంగంలోకి దిగి.. సంక్షోభం నుంచి బయట పడేసే వారు. అలాగే ఆయన స్వంత పార్టీకి విధేయుడుగా ఉంటునే ఇతర పార్టీలతో సత్సంబంధాలున్న వ్యక్తి.. ఒక రకంగా భిన్న రాజకీయ సిద్దాంతాల , భావజాలాలకు వారధిగా ఉన్నారు. ఆయన చివరి వరకు కాంగ్రెస్ నాయకుడే కాదు.. ప్రతి పక్షాలకు మిత్రుడుగా వ్యవహరించారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతు లభించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ సహా ఏడు క్షమాభిక్ష పిటిషన్లను ప్రణబ్ తిరస్కరించారు. రాష్ట్రపతిగా ఉండగానే.. టీచర్స్ డే సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆయన భారత రాజకీయ చరిత్రను బోధించడం విశేషం. ఆయన చివరి అంకంలో ఓ వివాదంలో ఇర్కున్నారు. ఆర్ ఎస్ ఎస్ పార్టీ ఆహ్వానాన్ని మన్నించి , ఆ పార్టీ సమావేశానికి వెళ్లారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున్న విమర్శలెదుర్కున్నారు. వాటిని సున్నితంగా తోసిపుచ్చారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన అంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.