Netflix Free: ఓటీటీ లవర్స్‌కి పండగే.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సేవలు..!
Netflix Free: ఓటీటీల లవర్స్‌కి పండగే.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సేవలు
Netflix Free: ఓటీటీలకు భారీగా ఆదరణ పెరుగుతోంది. కరోనా తర్వాత ఊపందుకున్న ఓటీటీ మార్కెట్ ఇప్పుడు రూ. వందల కోట్లకు చేరుకుంది. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఓటీటీలకు క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం అన్ని ఓటీటీ సంస్థలు సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై నెట్‌ఫ్లిక్స్‌ను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే ఉచితంగా చూడొచ్చని సమాచారం.
యూరప్, ఆసియా ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని నెట్‌ఫ్లిక్స్ ఈ ఉచిత ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో ఉచిత సేవలు అందుబాటులోకి వస్తాయన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే నెట్‌ఫ్లిక్స్ అందించే ఉచిత సేవల్లో ప్రకటనలు వస్తాయని సమాచారం. యూజర్ల నుంచి మిస్ అయ్యే రెవెన్యూను ప్రకటనల నుంచి పొందాలనేది నెట్‌ఫిక్ల్స్ లక్ష్యంగా తెలుస్తోంది. ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి ప్రకటనలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎలాంటి ప్రకటనలు లేకుండా వీక్షించాలనుకుంటే మాత్రం ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే నెట్‌ఫ్లిక్స్ అందించనున్న ఈ ఉచిత ప్లాన్‌లో కంటెంట్‌పై ఏమైనా నియంత్రణు ఉంటుందా.? కేవలం కొన్ని రకాల కంటెంట్‌కు మాత్రమే పరిమితం చేస్తారా.? అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే నెట్‌ఫ్లిక్ ఈ ఫ్రీ ఫ్లాన్‌ను ఇప్పటికే కెన్యాలో పరీక్షించారు. లిమిటెడ్ సెలెక్ట్ కంటెంట్‌ను కెన్యాలో నెట్‌ఫ్లిక్స్ అందించింది. కానీ, తర్వాత దాన్ని నిలిపివేసింది. మరి నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌లో అమల్లోకి వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.