Ramadan 2022: రంజాన్ మాసంలో ఉపవాసం మాత్రమే కాదు.. ఈ విషయాలలో జాగ్రత్త అవసరం..
Ramadan 2022: రంజాన్ మాసం ప్రారంభమైంది. 2 ఏప్రిల్ 2022 న శనివారం చంద్రుని దర్శనం తర్వాత భారతదేశంలో మొదటి ఉపవాసం ఏప్రిల్ 3 న మొదలవుతుంది.
Ramadan 2022: రంజాన్ మాసం ప్రారంభమైంది. 2 ఏప్రిల్ 2022 న శనివారం చంద్రుని దర్శనం తర్వాత భారతదేశంలో మొదటి ఉపవాసం ఏప్రిల్ 3 న మొదలవుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ 9వ నెల. భగవంతుడిని ఆరాధించడానికి ఇది అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ నెల మొత్తం ఉపవాసం తర్వాత, ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. అందుకే దీనిని మీతీ ఈద్ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి.
రంజాన్ మాసంలో ఉపవాసం అంటే ఆహారం, పానీయాలను నియంత్రించడమే కాదు..హృదయాన్ని, ఆలోచనను కూడా నియంత్రించడాన్ని నేర్పుతుంది. చెడును చూడవద్దని, చెడుగా మాట్లాడవద్దని, చెడు ఆలోచనలను మనసులో పెట్టుకోవద్దని ఈ మాసం చెబుతోంది. ఈ నెలలో వ్యక్తితో పాటు శరీరంలోని ప్రతి భాగం కూడా ఉపవాసం ఉంటుందని చెబుతారు. కాబట్టి ఈ మాసంలో కొన్ని పనులకు దూరంగా ఉండాలి.
పవిత్ర రంజాన్ మాసంలో శారీరక సంబంధాలు పెట్టుకోవడం నిషిద్ధం. ఈ నెలలో ఒక వ్యక్తి తన కోరికలను నియంత్రించుకోవాలి. అలాగే ఎలాంటి అనైతిక ప్రవర్తనలో పాల్గొనవద్దు. రంజాన్ మాసంలో ముస్లిం మతాన్ని అనుసరించేవారు మాయమాటలు చెప్పి ఎవ్వరిని మోసం చేయకూడదు. అలా చేస్తే అల్లా వారిని శిక్షిస్తాడు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఎటువంటి చెడు కార్యక్రమాలలో పాల్గొనకూడదు. రంజాన్ మాసంలో పొరపాటున కూడా పొగ తాగకూడదు. మద్యం సేవించకూడదు. ఇలా చేయడం వల్ల ఉపవాస ఫలం లభించదని గుర్తుంచుకోండి. రంజాన్ మాసంలో ఎవరికీ చెడు చేయకూడదు. అలాగే ఎవరి గురించి తప్పుగా ఆలోచించకూడదు.