Viral Video: 188 ఏళ్ల వృద్ధుడు... ఈ వైరల్ వీడియోలో నిజమెంత.?
Viral Video: 188 ఏళ్ల ఓ వృద్ధుడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరుకు సమీపంలోని ఓ గుహలో ఉన్న వృద్దుడి వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వందేళ్లు ఆయురారోగ్యంతో జీవించమని దీవిస్తుంటారు. అంటే వందేళ్లు బతకడమే గొప్ప అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారిన ప్రస్తుత పరిస్థితులు జీవన విధానం కారణంగా వందేళ్లు కాదు కదా.. 70 ఏళ్లు ఆరోగ్యంగా జీవించడమే గొప్ప అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే 180 ఏళ్లకిపైగా జీవిస్తే.. వినడానికి షాకింగ్‌గా ఉంది కదూ. అయితే ఇది నిజంగా నిజమైంది. ఓ వృద్ధుడు 188 ఏళ్లు జీవించాడన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
188 ఏళ్ల ఓ వృద్ధుడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరుకు సమీపంలోని ఓ గుహలో ఉన్న వృద్దుడి వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన సియారామ్ బాబా అనే ఓ వ్యక్తి బెంగళూరుకు సమీపంలో ఓ గుహలో జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు గుర్తించారని చెబుతున్నారు.
ఇటీవల ఆ వృద్ధుడిని గుహ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆయన వయసు 180 ఏళ్లకుపైమాటే అని అంటున్నారు. కన్సర్డ్ సిటీజన్ అనే ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ అతని వయసు 188 ఏళ్లు అంటూ రాసుకొచ్చారు. సియారామ్ బాబా తన జీవితాన్ని రాముడు, రామాయణానికే అంకితం చేశారని చెబుతున్నారు. ఇలా గత కొన్ని రోజులుగా వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
అయితే నెట్టింట వైరల్ అవతోన్న వీడియోలో నిజం లేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ కథనం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన వయసు 110 ఏళ్లు అని చెబుతున్నారు. అయితే ఆ వృద్ధుడు బెంగళూరుకు చెందిన చెందిన వ్యక్తి కాదని. మధ్యప్రదేశ్‌లో జీవిస్తున్నాడని తెలుస్తోంది.