Dont Touch Trees at Night: రాత్రిపూట చెట్లను ముట్టుకోవద్దు.. శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకోండి..!
Dont Touch Trees at Night: రాత్రిపూట చెట్లను ముట్టుకోవద్దని పెద్దలు చెబుతారు. ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియకుండా ముట్టుకున్నా వద్దని హెచ్చరిస్తారు.
Dont Touch Trees at Night: రాత్రిపూట చెట్లను ముట్టుకోవద్దని పెద్దలు చెబుతారు. ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియకుండా ముట్టుకున్నా వద్దని హెచ్చరిస్తారు. కారణమేంటంటే హిందూ సంప్రదాయం ప్రకారం.. చెట్లను, మొక్కలను దైవస్వరూపంగా భావిస్తారు. ఇదికాకుండా చెట్లకు, మొక్కలకు ప్రాణం ఉంటుందని జగదీశ్ చంద్రబోస్ ఎప్పుడో చెప్పారు. దీని ప్రకారం.. రాత్రిపూట అవి కూడా నిద్రిస్తాయి. కాబట్టి వాటిని డిస్ట్రబ్ చేయకూడదని చెబుతారు. అలాగే శాస్త్రీయ కారణాల గురించి కూడా తెలుసుకుందాం.
సాయంత్రం, రాత్రి వేళల్లో మొక్కలను, చెట్లను తాకి ఆకులు, పువ్వులు కోయడం శాస్త్రీయ దృక్కోణంలో తప్పుగా భావిస్తారు. ఎందుకంటే చెట్లు, మొక్కలు పగటి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అలాగే రాత్రివేళల్లో ఆక్సిజన్‌కు బదులు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. అందుకే చెట్ల కిందికి రాత్రివేళ వెళ్లడం నిషేధించారు.
మనుషులు, జంతువుల లాగే మొక్కలు కూడా రాత్రిపూట నిద్రిస్తాయి. నిద్రలో ఉన్నవారిని లేపితే ఎంత పాపమో చెట్లు, మొక్కలను రాత్రులు తట్టిలేపడం కూడా అంతే పాపం. అందుకే సాయంత్రం వేళ్లలో పువ్వులు, ఆకులు కోయడం నిషేధం. అలాగే ఎన్నో జీవరాశులు పక్షులు, జంతువుతు, సూక్ష్మజీవులు, కీటకాలు రాత్రిపూట చెట్లు, మొక్కలపై నివసిస్తాయి. రాత్రిపూట వాటిని తాకడం వల్ల వాటికి నిద్రభంగం జరుగుతుంది. కాబట్టి మన పూర్తీకులు రాత్రిపూట చెట్లను , మొక్కలను తాకనిచ్చేవారు కాదు.