బార్‌లు, పబ్బులు, క్లబ్‌ల మధ్య చాలామందికి తేడా తెలియదు.. ఎందుకంటే..?

బార్‌లు, పబ్బులు, క్లబ్‌ల మధ్య చాలామందికి తేడా తెలియదు.. ఎందుకంటే..?

Update: 2022-09-18 15:30 GMT

బార్‌లు, పబ్బులు, క్లబ్‌ల మధ్య చాలామందికి తేడా తెలియదు.. ఎందుకంటే..?

BAR PUB Club: పార్టీ పేరు వినిపించిందంటే చాలు అందరు బార్, క్లబ్, పబ్, లాంజ్ అంటూ మొదలైన వాటి గురించి ఆలోచిస్తారు. చాలామంది ఈ ప్రదేశాలకు వెళ్లి ఉంటారు కానీ వీటి మధ్య తేడా గమనించి ఉండరు. పబ్, బార్, క్లబ్, లాంజ్ మధ్య తేడా ఉంటుంది. అలాగే ఈ ప్రదేశాలన్నీ ఒకదానితో ఒకటి భిన్నంగా ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బార్ (BAR)

బార్ అంటే మద్యం అమ్మడానికి అనుమతి ఉన్న ఒక ప్రదేశం. బార్‌లో ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. అంతేకాకుండా అక్కడే కూర్చుని తాగొచ్చు. అయితే పానీయం ముగిసిన తర్వాత ఇక్కడ ఎక్కువసేపు ఉండలేరు. దీన్ని నడపడానికి ప్రత్యేక అనుమతి అవసరం. లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే ఇక్కడ మద్యం అమ్ముతారు. ఇది కాకుండా తినడానికి కొన్ని ఆహార ఎంపికలు ఉంటాయి.

పబ్

పబ్ అంటే మద్య పానీయాలు అందించే పబ్లిక్ హౌస్ లాంటిది. ఇక్కడ మీరు ఇంటిలాంటి వాతావరణాన్ని పొందుతారు. బార్ లాగా నిర్ణీత ప్రదేశంలో కూర్చుని మద్యం సేవించడం వంటి నిబంధనలు ఉండవు. పబ్‌లో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మీరు డ్యాన్స్‌ చేయవచ్చు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ లాంటి కార్యక్రమాలు జరుగుతాయి.

క్లబ్

బార్‌లు, పబ్బుల కంటే క్లబ్‌లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇక్కడ మీరు పెద్ద డ్యాన్స్ ఫ్లోర్ లేదా డ్యాన్స్ స్టేజ్ చూడవచ్చు. క్లబ్‌లోకి ప్రవేశించడానికి ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఇది కాకుండా సభ్యత్వం కూడా తీసుకోవచ్చు. ప్రజలు ఎక్కువ సమయం గడపడానికి క్లబ్‌లను ఇష్టపడతారు.

లాంజ్

లాంజ్‌లో మీకు కోచ్‌లు, లాంజ్ కుర్చీలు లభిస్తాయి. ఇక్కడ మీరు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. బార్‌లో కంటే లాంజ్‌లో తక్కువ నియమాలు ఉంటాయి. దీని వల్ల ఇక్కడ ఎక్కువ సమయం గడపవచ్చు.

Tags:    

Similar News