Indian Railways: రైలు పైకప్పుపై గుండ్రని ఆకారంలో మూతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..!
Indian Railways: భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
Indian Railways: భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వేల ద్వారా ప్రయాణం చౌకగా, సౌకర్యవంతంగా ఉంటుంది. దీని కారణంగా దీనిని దేశం లైఫ్ లైన్ అని పిలుస్తారు. భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్, ఆసియాలో రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. భారతదేశంలోని మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య దాదాపు 8000లుగా ఉంది. అయితే, ప్రయాణిస్తున్నప్పుడు అన్ని రైలు కోచ్‌ల పైన మూతలను కూడా తప్పక చూసి ఉంటారు. కానీ, అవి ఎందుకు ఇన్‌స్టాల్ చేశారోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అవేంటి, ఎందుకు ఇన్‌స్టాల్ చేశారో ఇప్పుడు చూద్దాం..
బహుశా చాలా మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవచ్చు. రైలు కోచ్‌పై మూతలు ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.. రైలు కోచ్‌పై ఉండే ఈ రౌండ్ మూతలను వెంటిలేటర్‌లు అంటారు. రైలులో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుండటంతో, రైలు నుంచి వేడిని తొలగించడానికి కోచ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రైలులో ఎక్కువ మంది ప్రయాణిస్తుండటంతో కోచ్‌లు కిక్కిరిసిపోతుంటాయి. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో, ఈ పైకప్పు వెంటిలేటర్లు తేమ, వేడిని తొలగిస్తాయి.
ప్రయాణిస్తున్నప్పుడు, మీరు రైలులో లోపల సీలింగ్‌పై గుండ్రని రంధ్రాలతో కూడిన విండోలు ఉంటాయి. వీటిని రైలు కోచ్ పైన ఉన్న ప్లేట్లకు అతికిస్తుంటారు. వీటి ద్వారా రైలు వేడి లేదా గాలి వెళుతుంది. వెచ్చని గాలి ఎల్లప్పుడూ పైకి వెళ్తుంది.
వేడి గాలి కోచ్ లోపల వెంట్స్ లేదా మెష్ ద్వారా రూఫ్ వెంటిలేటర్ల ద్వారా బయటకు వెళ్తుంది. దూరం నుంచి చూస్తే మూతలా కనిపించే రూఫ్ వెంటిలేటర్ పైన గుండ్రటి లేదా ఇతర ఆకారపు ప్లేట్లు ఉంచుతారు. రైలు కోచ్‌లోని వేడి గాలిని రూఫ్ వెంటిలేటర్ల ద్వారా బయటకు పంపేందుకు ఈ ప్లేట్‌లను అమర్చారు.