ఓటేశాక చూపుడు వేలికి వేసే 'ఇంక్' ఎలా తయారవుతుందో తెలుసా?

పోలింగ్ రోజున ఓటు వేసినట్టు చూపుడు వేలికి సిరా గుర్తును చూపుతాం. ఈ సిరా మార్కు వారం రోజుల వరకు కూడ చెరిగిపోదు.

Update: 2024-05-12 05:23 GMT

ఓటేశాక చూపుడు వేలికి వేసే 'ఇంక్' ఎలా తయారవుతుందో తెలుసా?

Ink on voting index finger: పోలింగ్ రోజున ఓటు వేసినట్టు చూపుడు వేలికి సిరా గుర్తును చూపుతాం. ఈ సిరా మార్కు వారం రోజుల వరకు కూడ చెరిగిపోదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన సిరాను ఎన్నికల సంఘం ఉపయోగిస్తుంది.

1962 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా బ్లూ ఇంక్ వాడారు. అప్పటి నుండి ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నందుకు గుర్తుగా ఓటరు ఎడమ చేతి వేలుపై సిరా గుర్తును వేస్తారు.దొంగ ఓట్ల నివారణకు గాను ఈ సిరాను వాడకంలోకి తెచ్చారు.

సిల్వర్ నైట్రేట్ అనే రసాయనంతో ఈ ఇంక్ ను తయారు చేస్తారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ను కలుపుతారు.నేషనల్ ఫిజికల్ ల్యాబోరేటరీస్ ఫార్మూలాతో సిరా ఉత్పత్తిని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (మైలాక్) సంస్థ ప్రారంభించింది.

దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు కూ మైలాక్ సంస్థ తయారు చేసిన సిరాను ఈసీ ఉపయోగిస్తుంది.అయితే ఇదే తరహా ఇంక్ ను హైద్రాబాద్ లోని రాయుడు ల్యాబోరేటరీస్ సంస్థ కూడ తయారు చేస్తుంది.

రాయుడు ల్యాబోరేటరీస్ సంస్థ తయారు చేసే ఇంక్ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. ఈ సంస్థ తయారు చేసిన సిరా ఆఫ్రికా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది.

దేశంలోని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తాము కూడ ఇంక్ ను సరఫరా చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాయుడు ల్యాబోరేటరీస్ సంస్థ కోరింది. అయితే ఈ విషయమై ఆ సంస్థకు ఈసీ నుండి ఈసారి అనుమతి రాలేదని ఆ సంస్థ ఎండీ రాయుడు హెచ్ఎం డిజిటల్ కు తెలిపారు..

2001 నుండి తాము ఈసీ అడిగిన అన్ని పత్రాలను కూడ సమర్పించినట్టుగా రాయుడు వివరించారు. పల్స్ పోలియోకు ఇదే సంస్థ తయారు చేసిన సిరాను వినియోగిస్తున్నారు.

మైలాక్ తయారు చేసే ఒక్క బాటిల్ లో 10 మి.లీ.సిరా ఉంటుంది. దీని ద్వారా 700 మందికి ఇంక్ మార్క్ వేయవచ్చు. ఒక్క బాటిల్ ధర రూ.160 నుండి రూ.170 మధ్య ఉంటుంది.

Tags:    

Similar News