Bats Village: నిజంగానే గబ్బిలాలకి ఈ లక్షణం ఉంటుందా.. గబ్బిలాల గ్రామం గురించి తెలుసా..?
Bats Villege: దేశంలో వింతైన గ్రామాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఉంది.
Bats Village: దేశంలో వింతైన గ్రామాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఉంది. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే గ్రామస్థులు గబ్బిలాలని శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ గ్రామానికి గబ్బిలాల గ్రామం అని పేరు వచ్చింది. చుట్టు పక్కల వారు ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడ జరిగే సంఘటనలని చూసి వారు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి కరోనా వైరస్ రావడానికి కారణం గబ్బిలాలే. అంతేకాదు పరిశోధకులు ఇటీవల ఒక నివేదికను కూడా విడుదల చేశారు. భవిష్యత్తులో ఏదైనా అంటువ్యాధి వ్యాపిస్తే అది గబ్బిలాల వల్ల మాత్రమే వస్తుందని హెచ్చరించారు. ఎందుకంటే దీనివల్ల వైరస్ మానవులకి చేరడం చాలా సులభం. అయినప్పటికీ ఈ గ్రామస్థులు గబ్బిలాలని ఎందుకు నమ్ముతారో ఈ రోజు తెలుసుకుందాం.
మానవుడు గబ్బిలాలకి దూరంగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే అవి కోల్డ్ బ్లడ్ జీవులు. వీటిలో ఏ వైరస్ అయినా వేగంగా వృద్ధి చెందుతుంది. అందుకే ఈ జీవులు ఎక్కడ కనిపించినా మనుషులు తరిమి కొడతారు. అయితే గబ్బిలాలని విశ్వసించే గ్రామం కూడా ఒకటి ఉంది. బీహార్‌లోని వైశాలి జిల్లా సర్సాయి గ్రామం గురించి చెప్పగానే అందరికి గబ్బిలాలు గుర్తుకు వస్తాయి. ఈ గ్రామం అసలు పేరు కంటే గబ్బిలాల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న కారణంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.
ఈ గ్రామ ప్రజలు గబ్బిలాలని శుభప్రదంగా భావిస్తారు. ఇవి గ్రామంలో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. గ్రామంలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు గబ్బిలాలన్ని సందడి చేస్తూ హెచ్చరిస్తాయని తెలిపారు. అదే వారి గ్రామానికి చెందిన వ్యక్తి అయితే చాలా ప్రశాంతంగా ఉంటాయని చెప్పారు. ఊరి ప్రజలందరి వాసనను గబ్బిలాలు గుర్తిస్తాయని చెబుతున్నారు. వింత వాసన వచ్చినప్పుడల్లా శబ్దం చేస్తూ గ్రామస్తులను అప్రమత్తం చేస్తాయని అంటున్నారు. అందుకే గబ్బిలాలంటే మాకు ఇష్టమని చెబుతున్నారు.