Coronavirus Live Updates: కరోనా పై చైనా గెలుపు.. భారత్ లో కరోనా కట్టడికి ఏర్పాట్లు!

Update: 2020-03-19 09:43 GMT
file photo

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడుతోంది. కరోనా పుట్టిల్లు చైనా పూర్తిగా కరోనాను తరిమి కొట్టినట్టు ప్రకటించింది. భారత దేశంలో కరోనా ఇప్పుడిప్పుడే ప్రతాపాన్ని చూపించడం ప్రారంభం అయింది. తెలంగాణలో నిన్న ఒక్క రోజే 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం అలర్ట్ అయింది. 

ఇప్పటి వరకూ ఉన్న కరోనా అప్ డేట్స్..

Live Updates
2020-03-19 13:17 GMT

విశ్వాన్ని నాశనం చేయడానికి ప్రతి వంద ఏళ్లకు ఒక సారి ఏదో ఒక మహమ్మారి అవతారం ఎత్తుతూనే ఉంది. ఏదో ఒక అంటు వ్యాధి ప్రతి వంద ఏండ్లను ఒక సారి ప్రపంచంలోని సగం జనాభాను మట్టుపెడుతుంది. -పూర్తి కథనం 


2020-03-19 12:30 GMT

తిరుమలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తిరుమల ఘాట్ రోడ్ మూసివేశారు. అలిపిరి టోల్‌గేట్ మూసివేసి వాహనాలను కొండపైకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.-పూర్తి కథనం 


2020-03-19 12:00 GMT

ఈ నెల 14న రామగుండం రైల్వే స్టేషన్ కు వచ్చిన ఇండోనేషియా దేశస్థుల దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. రైల్వే స్టేషన్ లో దిగి నడుస్తూ బయటకు వచ్చి అద్దె వాహనం మాట్లాడుతున్నారు.-పూర్తి కథనం 


2020-03-19 11:53 GMT

కరోనాపై తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. అన్నీ నగరాల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు.- పూర్తి కథనం 


2020-03-19 11:03 GMT

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. మరోవైపు అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -పూర్తి కథనం 




2020-03-19 10:20 GMT

కారోన వైరస్ పై  అవగాహనా పెంచడానికి ఈ విషయని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు సినీ స్టార్స్ కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిరంజీవి వీడియో చేసారు. -పూర్తి కథనం  

2020-03-19 10:07 GMT

కరోనాపై చైనా గెలిచింది మూడున్నర నెలలు కరోనాతో అల్లాడిన చైనాకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఇవాళ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ఏ పౌరుడికీ కరోనా పాజిటివ్ రాలేదని వెల్లడించింది.    - పూర్తి కథనం  

Tags:    

Similar News