Coronavirus Effect ON Raksha Bandhan: రాఖీ సోదర సోదరీమనుల అనురాగం, ఆప్యాయతలకి ప్రతీక. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల బంధాన్ని మరింత బలపరుచుకునేందుకు జరుపుకునే పండుగ ఐతే అన్ని రంగాల మీద ఎఫెక్ట్ చూపిన కరోనా రాఖీ వ్యాపారస్తుల్ని కూడా వదలలేదు. ఐతే ఏళ్లుగా రాఖీ వ్యాపారం చేస్తున్న వారు ఈ పరిస్థితిని ఎలా హ్యండిల్ చేస్తున్నారో చూద్దాం.
రాఖీ పండగ వస్తోందంటే నాలుగు రోజుల ముందు నుంచి హడావిడి మొదలవుతుంది. ఐతే కోవిడ్ ప్రభావంతో ఈసారి రాఖీ వ్యాపారం మందకోడిగా నడుస్తోంది. హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో ఉన్న యాదవ్ రాఖీ వాలా సెంటర్ నిర్వహకులు గత 20 ఏళ్లుగా రాఖీ వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ హోల్ సేల్ లో అమ్మకం ఉండడంతో రాఖీ పండగకు మూడు నెలల ముందు నుంచే వ్యాపారం జోరుగా సాగేది. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం బిజినెస్ కూడా అవ్వడం లేదని నిర్వహకులు అంటున్నారు. నగరంలో రాఖీ షాపులు తెరుచుకొని లేకపోయేసరికి యాదవ్ వాలా రాఖీ సెంటర్ కి పబ్లిక్ బాగా వస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సానిటైజ్ చేస్తూ మాస్క్ ఉంటేనే వినయోగదారుల్ని లోనికి అనుమతిస్తున్నారు ఒకసారి ఐదుగురికి మాత్రమే లోనికి ప్రవేశించడానికి అనుమతిస్తున్నారు. మిగతవారందరు అక్కడే నిరీక్షించేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు షాప్ ఓనర్ చెబుతున్నారు.
సింగిల్ పీస్, స్టోన్, జరీలు, స్పాంజ్, దొరలు, మెటల్, కోల్ కతా, పంజాబి, కిడ్స్ రాఖీలు ఇలా రెండు నుంచి మూడు వేల వెరైటీల రాఖీలు యాదవ్ రాఖీ వాలా షాపులో దొరుకుతాయి ముంబై, ఢిల్లీ, కోల్ కతా, జైపూర్, రాజ్ కోట్ నుండి రాఖీల ముడి సరుకుని దిగుమతి చేసుకుంటారు. కానీ ఈ ఏడాది దిగుమతి ఆస్కారమే లేకుండా పోయింది ముప్పై మంది సిబ్బందితో నడిపించాల్సిన షాపును ఈ ఏడాది 6 మందితో నడిపిస్తున్నట్లు షాప్ ఓనర్ చెబుతున్నారు. ఇక్కడ హోల్ సేల్ ధరలకే రాఖీలు దొరుకుతుండడంతో రెండు నెలల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. రాఖీ పండక్కి రెండు రోజుల ముందు నుంచి ఎలాంటి లాభం లేకుండా రాఖీలు అమ్మకం చేస్తున్నట్లు కూడా నిర్వహకులు అంటున్నారు. ప్రతీ ఏడాది రాఖీ పండగను చాలా ఉత్పాహంగా నిర్వహించుకునే ప్రజలు ఈసారి కరోనా ప్రభావంతో జాగ్రత్తలు తీసుకొని పండగ జరుపుకుంటామని అంటున్నారు.