Contactless payments watch: ఏదైనా కొనాలంటే కార్డు అక్కర్లేదు.. ఈ వాచీ ఉంటె చాలు!

Contact less payments watch: టైటాన్ నుంచి కాంటాక్ట్ లెస్ పేమెంట్ వాచీలు వచ్చాయి. ఈ వాచీలతో ఏటీఎం కార్డు అక్కర్లేకుండానే పేమెంట్ చేయొచ్చు!

Update: 2020-09-17 06:17 GMT
Contactless payment watches

బ్యాంకులకు వెళ్లి క్యూల్లో నిలబడి డబ్బులు తెచ్చుకునే రోజులు ఎప్పుడో పోయాయి. కాష్ చేత్తో పట్టుకుని వెళ్లి కావలసినవి కొనుక్కునే కాలం కాదిది. అంతేకాదు కరోనా దెబ్బకు డబ్బులు చేత్తో పట్టుకోవాలన్న భయపడే పరిస్థితి. ఇప్పుడు అంతా కార్డ్ లెస్ పెమేంట్ల కాలం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీ వాచీలను తీసుకువచ్చే టైటాన్ కంపెనీ ఇప్పుడు భారత దేశంలో మొదటిసారిగా కాంటాక్ట్ లెస్‌ పేమెంట్స్‌ కోసం ఐదు కొత్త వాచ్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. టైటాన్ పే ఫీచర్ తో ఈ వాచ్లు రిలీజ్ చేసింది. ఈ వాచీలతో ఎతేఎమ్ కార్డు అవసరం లేకుండానే పేమెంట్ చేయవచ్చు.

ఇప్పుడు టైటాన్ కంపెనీ పెమేంట్ల కోసం ఎస్బీఐ తో ఒప్పందం చేసుకుంది. ఈ వాచ్‌లతో పీఓఎస్‌ మిషన్‌ల వద్ద పిన్‌ అవసరం లేకుండా రూ. 2,000 వరకు చెల్లించొచ్చు. అంతకు మించి నగదు చెల్లించాలంటే మాత్రర పిన్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వాచీ స్ట్రాప్ లో ప్రత్యేకమైన చిప్ ను అమర్చింది టైటాన్. కాంటాక్ట్ లెస్‌ పేమెంట్ ఫీచర్‌ కోసం సురక్షితమైన నియర్‌-పీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) చిప్‌ను వాచ్‌ స్ట్రాప్‌లో ఉంచినట్లు టైటాన్‌ భరోసా ఇస్తోంది. యోనో ఎస్‌బీఐ సాయంతో దుకాణాలు, పీఓఎస్‌ మెషీన్లు అందుబాటులో ప్రతి చోటా టైటాన్ పే పనిచేస్తుంది. ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేసుకోవడానికి యూజర్స్‌ తమ ఎస్‌బీఐ ఖాతాతో కేవైసీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా టైటాన్ పే యాక్టివేట్ అవుతుంది.

ఇక ఈ వాచీల ధర ఎంతో తెలుసా? ఐదు వాచ్ మోడల్స్‌లో మూడు పురుషుల కోసం, రెండు స్త్రీల కోసం డిజైన్‌ చేసినట్లు టైటాన్‌ తెలిపింది. పురుషుల వాచ్‌ ధరలు వరుసగా రూ. 2,995, రూ.3,995, రూ.5,995గాను.. స్త్రీల వాచ్‌ ధరలు రూ.3,895, రూ.4,395గా కంపెనీ నిర్ణయించింది. మరెందుకు ఆలస్యం కొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ వాచీలపై మీరూ ఓ లుక్కేయండి!

Tags:    

Similar News