కరోనా వైరస్ ఈ పేరు వింటే చాలు ఉలికిపాటు తప్పడం లేదు. ఎక్కడన్నా తుమ్ము.. దగ్గు శబ్దాలు వినపడితే చాలు కంగారు మొదలవుతోంది చాలా మందికి. మాస్క్ సరిచేసుకోవడం.. చేతులు కడుక్కోవడం.. ఆ తుమ్మిన వ్యక్తీ ఎంత దూరంలో ఉన్నాడో చూసుకోవడం ఇలా అయిపొయింది పరిస్తితి. ఇక ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాదాపుగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ పరిస్థితుల్లో కరోనా విషయంలో ఎన్నో అనుమానాలు. వాటిలో ముఖ్యమైనది కూరగాయలు బజారు నుంచి తెస్తే అవి కరోనా వ్యాప్తి చేస్తాయా లేవా అనేది ఒకటి. ఈ విషయంలో పలువురు నిపుణులు సలహాలు ఇస్తున్నారు. బజారు నుంచి తెచ్చిన కూరగాయల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరించి చెబుతున్నారు. అందులోని ముఖ్యాంశాలు మీకోసం..
- కూరగాయల మీద సాధారణ పరిస్థితుల్లో కరోనా వైరస్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. వాటికి పొలాల్లో వాడే క్రిమిసంహారక మందులే కారణం. అయితే, బజారులో ఎవరైనా కరోనా సోకిన వ్యక్తీ ఉంది.. పొరపాటున అతని దగ్గు, తుమ్ము తుంపర్లు వాటిమీద పడితే కరోనా వైరస్ వాటిమీద చేరే అవకాశం ఉంటుంది.
- ఇది మనకు తెలీకుండా జరుగుతుంది. అందుకే, కూరగాయలు ఇంటికి తీసుకువచ్చాకా వాటిని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.
- చాలా మంది కూరగాయలను ఎండలో పెట్టడం వంటి పనులు చేస్తుంటారు. వేడికి వైరస్ చచ్చిపోతుందనే ఆలోచనతో. కానీ, ఇది సరికాదు. వేడి వాతావరణంలో వైరస్ ముఖ్యంగా కరోనా చనిపోతుందని చెప్పే ఆధారాలు ఇంకా ఏమీ లేవు.
- కూరగాయలను శుభ్రంగా కడగడం ద్వారా మాత్రమే సురక్షితం గా ఉండవచ్చు.
- కూరగాయలను బజారు నుంచి తీసుకురాగానే ఉప్పు నీటితో కడగడం మంచిది. కుళాయి నీటి కింద కడగడం క్షేమకరం. వైరస్ ఉన్న లేకపోయినా ఇలా చేయడం వాళ్ళ కూరగాయల మీద ఉండే క్రిమిసంహారక మందుల అవశేషాలు..ఇతర బాక్టీరియా నశించే అవకాశాలుంటాయి. ఇక చాలా మంది కూరగాయలు కోసిన తరువాత శుభ్రం చేస్తారు. ఈ విధానం అంత మంచిది కాదు.
- పొటాషియం పర్మాంగనేటు ద్రావణం తో కూరగాయల్ని కడుక్కుంటే మంచిది. తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకుని వాడుకోవాలి.
- కూరగాయలు పచ్చిగా తినకపోవడమే మంచిది. బాగా ఉడికించిన తరువాతే తినడం శ్రేయస్కరం.
-ఇక కూరగాయల కోసం వాడిన సంచుల్ని కూడా వెంటనే శుభ్రం చేసుకోవాలి. వాడి పాదేసే సంచులైతే..వాటిని బయట డస్ట్ బిన్ లో పడేసి మూట పెట్టాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూరగాయల నుంచి వచ్చే ఇబ్బందులు ఉండవు పైగా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.