పేరు లేనివి కొన్ని.. అడుగుపెట్టాలంటే వీసా అడిగేవి మరికొన్ని.. మనదేశంలో 5 ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఇవే.. విశేషాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

5 Unique Railway Stations in India: నేడు భారతదేశంలో 7000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రోజు మనం భారతదేశంలోని 5 ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకుందాం.

Update: 2023-09-06 10:30 GMT

పేరు లేనివి కొన్ని.. అడుగుపెట్టాలంటే వీసా అడిగేవి మరికొన్ని.. మనదేశంలో 5 ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఇవే.. విశేషాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

5 Unique Railway Stations in India: భవానీ మండి రైల్వే స్టేషన్ ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ఉంది. దాని లింక్ కూడా రెండు వేర్వేరు రాష్ట్రాలను కలుపుతుంది. ఈ రైల్వే స్టేషన్ సాధారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ మధ్య విభజించారు. రెండు వేర్వేరు రాష్ట్రాల మధ్య విభజించబడినందున, భవానీ మండి స్టేషన్‌లో ఆగే ప్రతి రైలు ఇంజన్ రాజస్థాన్‌ ప్రాతంలోనూ.. కోచ్ మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. భవానీ మండి రైల్వే స్టేషన్‌కి ఒక చివర రాజస్థాన్‌ అని, మరో చివర మధ్యప్రదేశ్‌ అని బోర్డు పెట్టి ఉంటుంది.

భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన రైల్వే స్టేషన్లలో నవాపూర్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. ఈ స్టేషన్‌లో ఒక భాగం మహారాష్ట్రలో, మరొకటి గుజరాత్‌లో ఉంది. నవాపూర్ రైల్వే స్టేషన్ వివిధ రాష్ట్రాల్లో రెండు భాగాలుగా విభజించారు. ఇక్కడ ప్లాట్‌ఫారమ్‌లు, బెంచీలపై మహారాష్ట్ర, గుజరాత్ రెండూ రాసి ఉంటాయి. స్టేషన్‌లో ప్రకటనలు 4 వేర్వేరు భాషలలో 'హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ'లో కూడా కనిపిస్తాయి.

అలాగే అత్తారి రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కాలనకుంటే లేదా స్టేషన్‌లో దిగాలనుకుంటే, మీకు తప్పకుండా వీసా ఉండాలి. వీసా లేకుండా భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అమృత్‌సర్‌లోని అత్తారి రైల్వే స్టేషన్‌ను సందర్శించడం నిషేధించారు. స్టేషన్‌లో భద్రతా బలగాలు 24 గంటలూ నిఘా ఉంచాయి. వీసా లేకుండా పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. అలాగే శిక్షించే ఛాన్స్ కూడా ఉంది.

జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి టోరీకి వెళ్లే రైలు కూడా తెలియని స్టేషన్ గుండా వెళుతుంది. ఇక్కడ సైన్ బోర్డు కనిపించదు. 2011లో తొలిసారిగా ఈ స్టేషన్ నుంచి రైళ్లు నడవడం ప్రారంభించినప్పుడు బడ్కిచంపి అని పేరు మార్చాలని రైల్వే భావించింది. అయితే స్థానిక ప్రజల వ్యతిరేకత కారణంగా ఈ స్టేషన్‌కు పేరు పెట్టలేదు. అప్పటి నుంచి ఈ స్టేషన్ పేరు లేకుండా పోయింది.

మరొక రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇది ఇప్పటికీ పూర్తిగా పని చేస్తుంది. కానీ, ఏ పేరు లేదు. బెనామ్ రైల్వే స్టేషన్ 2008లో పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ నుంచి 35 కి.మీ దూరంలో బంకురా-మసాగ్రామ్ రైలు మార్గంలో నిర్మించారు. మొదట్లో ఈ స్టేషన్ పేరు రాయ్‌నగర్, అయితే స్థానిక ప్రజలు స్టేషన్ పేరు మార్చాలని రైల్వే బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పేరు మార్చలేదు. కానీ, ఈ స్టేషన్ కూడా పేరులేనిదిగా మిగిలిపోయింది.

Tags:    

Similar News