Cat Bites: పిల్లి కరిస్తే చాలా ప్రమాదం.. ఇంతకీ ఏం జరుగుతుందంటే..?

Cat Bites: పిల్లి కరిస్తే చాలా ప్రమాదం.. ఇంతకీ ఏం జరుగుతుందంటే..?

Update: 2022-02-12 13:30 GMT

Cat Bites: పిల్లి కరిస్తే చాలా ప్రమాదం.. ఇంతకీ ఏం జరుగుతుందంటే..?

Cat Bites: పెంపుడు జంతువులలో పిల్లులు ఒకటి. చాలా మంది ఎంతో ఇష్టంతో వాటిని పెంచుకుంటారు. అయితే ఈ ఇష్టం కూడా ఒక్కోసారి ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే పిల్లి కరిస్తే చాలా డేంజర్. పిల్లికి పదునైన దంతాలు ఉంటాయి. ఇవి చర్మంలోకి చొచ్చుకుపోతే ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. పిల్లి నోటిలో ఉండే లాలాజలం ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు నిలయం. కాబట్టి అది కాటువేస్తే బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో వెంటనే చికిత్స చేయడం చాలా ముఖ్యం.

పిల్లి కరిస్తే వెంటనే వైద్యుడి వద్దకు లేదా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలి. ఒకవేళ ఆసుపత్రికి చేరుకోవడం సాధ్యం కాకపోతే ఇంట్లో ప్రథమ చికిత్స చేయాలి. గాయాన్ని సబ్బు నీటితో కడగాలి. తద్వారా బ్యాక్టీరియా కొంతవరకు నశిస్తుంది. కుక్క కాటులా పిల్లి కాటు కూడా రేబిస్‌కు కారణం అవుతుంది. దీన్ని నివారించడానికి రేబిస్ ఇంజెక్ట్ చేసుకోవడం మరిచిపోవద్దు. డాక్టర్ చెబితే టెటానస్ (టెటానస్) ఇంజెక్షన్ కూడా పొందాలి. టెటానస్ అనే బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా ప్రమాదకరం.

పెంపుడు జంతువులని ఎంతవరకు దగ్గరగా ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చు. ఒక్కోసారి వాటివల్ల రోగాలు సంభవించవచ్చు. ఆస్తమా ఉన్నవారు పెంపుడు జంతువులకి దూరంగా ఉంటే మంచిది. లేదంటే శ్వాసకోశ సమస్యలు వేధిస్తాయి. అంతేకాకుండా పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలి. లేదంటే అవి వ్యాధి బారిన పడుతాయి. తద్వారా మనం కూడా వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

Tags:    

Similar News