Optical Illusion: మీ కళ్లలో పవర్ ఉందా.? ఇందులో ఫ్లాస్క్ దాగి ఉంది, కనిపెట్టండి మరి..!
Optical Illusion: ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో ఉండే కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటికి అట్రాక్ట్ అవుతుంటారు.
Optical Illusion: ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో ఉండే కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటికి అట్రాక్ట్ అవుతుంటారు. ఎంతో ఇష్టంతో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను సాల్వ్ చేస్తుంటారు. ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో పలు రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని మన ఆలోచన విధానాన్ని పరీక్షిస్తే, మరికొన్ని కంటి చూపు పరీక్షిస్తాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు ఎన్నో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే పార్క్, అందులో పిల్లలు ఆడుకుంటున్నట్లు ఉంది కదూ! అయితే అందులో ఒక టీ ఫ్లాస్క్ దాగి ఉంది. దానిని కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. కేవలం 2 సెకండ్స్‌లో ఈ టాస్క్‌ను సాల్వ్ చేస్తే మీ ఐ పవర్ సూపర్ అని చెప్పొచ్చు. అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయడం అంత సులభమైన విషయం కాదు. అక్కడే ఉన్న వస్తువుల మధ్య ఆ ప్లాస్క్ ఉంది. ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే ప్లాస్క్ ఎక్కడుందో కనిపెట్టొచ్చు. ఇంతకీ మీరు ప్లాస్క్‌ను కనిపెట్టారా.?
ఒకవేళ కనిపెట్టలేకపోతే మీకోసం ఒక క్లూ ఇస్తున్నాం. ఫొటోలో కనిపిస్తున్న చెట్టును జాగ్రత్తగా గమనిస్తే ఆ ఫ్లాస్క్‌ను ఇట్టే కనిపెట్టవచ్చు. మరి ఓసారి చెట్టును చూడండి... ఫ్లాస్క్ కనిపించిందా.? టాస్క్‌ను సాల్వ్ చేశారా.? ఏంటి ఎంత ప్రయత్నించినా సమాధానం దొరకడం లేదా.? అయితే ఓసారి కింద ఉన్న ఫొటో చూడండి. బ్లాక్ సర్కిల్‌లోనే దాగి ఉందా ఫ్లాస్క్.