టాయిలెట్‌లో పెళ్లికొడుకు సెల్ఫీ తీసి పంపితే.... పెళ్లికూతురికి రూ.51వేల రూపాయలు...
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్తగా స్వచ్ఛ భారత్ కోసం ఓ పథకం తీసుకువచ్చింది. అక్కడ ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు.. వరుడు టాయిలెట్ లో ఉన్న ఫోటో ప్రభుత్వానికి ఇస్తే భారీ నజరానా ఇస్తుంది. ఇది వెనుకబడిన వర్గాలకే పరిమితం చేసింది. టాయిలెట్ వాడకం పై అవగాహన పెంచడం.. ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండాలనే ఆలోచన కల్పించడం ద్వారా స్వచ్చభారత్ పథకానికి మరింత ప్రచారం తేవచ్చనేది ఆ ప్రభుత్వ ఆలోచన.
పెళ్లి కొడుకు టాయిలెట్ లో సేల్ఫీ దిగితే పెళ్లి కూతురుకు డబ్బులు ఎందుకు ఇస్తారు అన్న అనుమానం కలుగుతుంది కదా.. ఆశ్చర్యపోకండి.. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర పధకం..ఆ పధకం పేరు 'ముఖ్యమంత్రి కన్య వివాహ పథకం'.. ఈ పధకం కింద ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలకి చెందినా అమ్మాయల పెళ్ళికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 51వేల రూపాయలను అందజేస్తుంది.
అయితే , సరిగ్గా ఇక్కడ ఓ మెలిక పెట్టారు. అదేమిటంటే.. ఏంటంటే ఆ పెళ్లికూతురు చేసుకోబోయే వరుడు ఇంట్లో టాయిలెట్ కచ్చితంగా ఉండాలి. ఆ టాయిలెట్‌లో వరుడు సెల్ఫీ తీసి పంపాలి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో అఫిడవిట్ దాఖలు చేయాలి. వాటికీ ఆ ఫోటోలని ఆడ్ చేయాలి. అలా అయినప్పుడు ఈ పధకం వర్తించి ఆ పెళ్ళికూతురుకి యాబై వేల రూపాలు వస్తాయి అన్నమాట.. దీనిని ఇలా పెట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినా స్వచ్ఛ భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుంది.
ఇప్పుడు ఈ పథకం అటు ప్రజలతో పటు.. ఇటు అన్ని రాష్ట్రాలను ఆకర్షిస్తోంది.