AP Assembly Session: రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
AP Assembly Session: పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
AP Assembly Session: రేపు ఏపీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా సమావేశాలను ఒకేరోజుకు కుదించగా.. గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన ప్రభుత్వం... మిగిలిన 9 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలు 2 లక్షల 28 వేల కోట్ల నుంచి 2 లక్షల 38 వేల కోట్లు ఉండే అవకాశాలున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఇక బడ్జెట్ సమావేశాలను ఒకే రోజులో ముగించడంపై మండిపడుతోన్న టీడీపీ.. ఇందుకు నిరసనగా సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.