Anand Mahindra: ఐడియా అదిరింది అంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
Anand Mahindra: మొక్కజొన్న కంకుల నుంచి మొక్కజొన్న విత్తులను వినూత్నంగా వేరు చేస్తున్న వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన మంచి విషయాలను పంచుకోవడం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కు అలవాటు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఎన్నో వినూత్యమైన వీడియోలను అయన షేర్ చేశారు. మరోసారి ఇంకో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర.
మొక్కజొన్న విత్తులను కంకుల నుంచి వేరుచేయడం శ్రమ.. సమయంతో కూడుకున్న పని. దానిని సులువుగా చేయడానికి ఓ రైతు అద్భుతమైన ఆలోచన చేశాడు. బైక్ సెంటర్ స్టాండ్ వేసి. ఆన్ చేసి.. గేరులో ఉంచాడు. ఇప్పుడు వెనుక చక్రం తిరుగుతుంటే దాని సహాయంతో బైక్ కి ఇరువైపులా ఇద్దరు కూచుని మొక్క కంకుల్ని వెనుక చక్రానికి తగిలించడం ద్వారా కంకుల నుంచి మొక్కజొన్న విత్తుల్ని వేరుచేస్తున్నారు. 20 సేకన్లకో మొక్కజొన్న కంకి నుంచి విత్తుల్ని వేరు చేయగలుగుతున్నారు ఈ పద్ధతిలో. ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
'మన వ్యవసాయ విధానంలో ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లను బహుళ రకాలుగా వినియోగిస్తూ ఎన్నో పనులను రైతులు సులువుగా చేసుకుంటున్న వీడియోలు నాకెన్నో వస్తుంటాయి. ఈ వీడియో నేను కలలో కూడా ఊహించనిది. ఇకపై 'కార్న్ టినెంటాల్' అనే ప్రత్యేక బ్రాండ్‌ను కాంటినెంటల్ టైర్స్ ప్రారంభించాల్సిన సమయం వచ్చిందేమో అని చమత్కరించారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిస వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
I constantly receive clips showing how creatively our farming communities turn bikes & tractor into multi-tasking machines. Here's one application I never would have dreamed of. Maybe @continentaltire should have a special brand named 'Corntinental?' pic.twitter.com/rMj6rowA3L
— anand mahindra (@anandmahindra) August 27, 2020