Indian Railway: టికెట్ బుక్ చేశాక, ప్రయాణంలో మార్పులా.. ఈ సింపుల్ టిప్స్‌తో బోర్డింగ్ స్టేషన్‌ను మార్చేయండిలా..!
Indian Railway Rules: రైల్వే టికెట్ బుక్ చేసిన తర్వాత, ప్రయాణీకులు ఒక్కోసారి బోర్డింగ్ స్టేషన్‌ను మార్చవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, రైల్వే ప్రయాణికులు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
Indian Railway Rules: అనేక సార్లు రిజర్వేషన్ చేసిన తర్వాత, ప్రయాణీకుల ప్లాన్‌లో కొంత మార్పు ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో కన్ఫర్మ్ టికెట్ చేసిన తర్వాత కూడా, మరొక స్టేషన్ నుంచి రైలు ఎక్కే సౌకర్యాన్ని రైల్వే కల్పిస్తుంది.
మీరు ఇంట్లో కూర్చొని మీ బోర్డింగ్ స్టేషన్‌ని మార్చుకోవచ్చు. బోర్డింగ్ స్టేషన్‌లో మార్పు కారణంగా ప్రయాణీకుల టికెట్ రద్దు చేయబడదు లేదా రైల్వేలు మీకు జరిమానా విధించవు.
నిబంధనల ప్రకారం, మీ ప్రయాణానికి 24 గంటల ముందు మాత్రమే బోర్డింగ్ స్టేషన్‌ని మార్చుకునే ఛాన్స్ ఉంది.
ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత మీరు బుకింగ్ టిక్కెట్ హిస్టరికీ వెళ్లాలి.
ఇక్కడ మీరు బోర్డింగ్ పాయింట్‌ని మార్చే ఎంపికను చూస్తారు. మీరు కోరుకున్న బోర్డింగ్ పాయింట్‌ను ఎంచుకుని, సబ్మిట్ చేయాలి. దీని తర్వాత, మీ మొబైల్‌కు బోర్డింగ్ స్టేషన్ మార్పు సందేశం వస్తుంది.