తల్లిప్రేమ: తన గుడ్లను రక్షించుకోవడానికి వడ్రంగి పిట్ట భయంకరమైన పాముతో పోరాటం
ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది మరోటి లేదు. తల్లిప్రేమకు మరోటి సాటి రాదు. తన గర్భంలో జీవం పోసుకున్న నాటి నుంచి ఆ బీజం నేలమీదకు వచ్చేంత వరకూ ఎంత కష్టపడుతుందో.. తన సంతానం పెరిగి పెద్దయ్యేవరకూ కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుకుంటుందో.. తన చివరి శ్వాస వరకూ తన బిడ్డల్ని ఎంతలా ప్రేమిస్తుందో చెప్పడానికి మాటలు చాలవు. సృష్టిలో ఎన్నో జీవరాశులున్నాయి. అన్నిటి మధ్యా ఎంతో వైరుధ్యం ఉంది. కానీ, అన్నిజీవ రాశుల్లోనూ కనిపించే సారూప్యం.. తల్లిప్రేమ ఒక్కటే. ఒక్కోసారి తల్లి చూపించే ప్రేమ..త్యాగం అందరి గుండెల్ని చేమరుస్తాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా.
అరణ్యంలో ప్రతి జీవికీ బతుకు నిత్యపోరాటమే. చిన్న జీవిని పెద్ద జీవి.. ఆ పెద్ద జీవిని.. మరో పెద్ద జీవి చంపుకు తినడమే అరణ్య న్యాయం. అదే సృష్టి. అయితే, తమ సంతానం అటువంటి జీవుల ఆకలికి బాలి కాకూడదని ప్రతి జీవీ నిత్యం తాపత్రయ పడుతుంది. ఎప్పుడో పదకొండేళ్ళ క్రితం పేరు దేశంలో ఓ అటవీ ప్రాంతంలో ఓ వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా మొన్న ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. ఆ వీడియో లో దృశ్యాన్ని చూసిన నెటిజన్లకు మతి పోయినంత పనైంది.
ఆ వీడియోలో ఓ పది అడుగుల విష సర్పం చెట్టు తొర్రలో ఉంది. దానిని ఓ వడ్రంగి పిట్ట తన శక్తికి మించి అడ్డుకుంటోంది. ఆ చెట్టు తొర్రలో ఉన్న తన గుడ్లను తినేయడానికి వచ్చిన అ మహా విశాసర్పంతో తన శాయశక్తులా పోరాడుతున్న ఆ వడ్రంగి పిట్ట ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అంతేకాదు తల్లి ప్రేమ ముందు మరేదీ సాటి రాదనీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ బలవంతమైన పాము వద్రంగి పిట్టని నాలుగైదు సార్లు కాటేసింది. దాంతో ఆ పిట్ట నెల కూలింది. అయినా సరే, తన పట్టు వదల కుండా మళ్ళీ లేచి వచ్చి ఆ సర్పం మీద దాడి చేస్తూనే వచ్చింది. అంత పెద్ద విష సర్పపు కోరలు తనను బాధించినా ఆ వడ్రంగి పిట్ట తన గుడ్లను రక్షించుకోవడానికి చేసిన పోరాటం ఎన్నో జీవన సత్యాలను చెబుతోంది..పోరాట స్ఫూర్తిని వెల్లడిస్తోంది.
మెట్రో న్యూస్ కథనం ప్రకారం యా వీడియో 2009లో అసఫ్పే అద్మానీ అనే ఇజ్రాయిల్రూ టూరిస్ట్ పేరూ దేశంలో తన సెలవులు గడపడానికి వెళ్ళినపుడు షూట్ చేశాడు. తరువాత దానిని యూ ట్యూబ్ లో ఉంచాడు. ఆ వీడియోను అప్పట్లోనే 8 మిలియన్ల మంది చూశారు.
ఆదివారం ఈ వీడియోను షేర్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ నందా '' ఈ సృష్టిలోని ఏ శక్తీ కూడా అమ్మ ప్రేమను ఓడించలేదు.'' అంటూ త్వీట్ చేశారు. దీనికి విశేష స్పందన వస్తోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
All the forces on this planet, will never beat that of a mothers love.
— Susanta Nanda IFS (@susantananda3) March 1, 2020
Wood pecker saving its chicks after a fierce air duel with the snake👍🏻 pic.twitter.com/mvBo7OWN74