Wine: ఈ వైన్‌ గురించి మీకు తెలుసా.. చాలా స్పెషల్‌..?

*మందుబాబులలో చాలామంది బ్రాంది, విస్కీ, బీర్, రమ్‌ తాగుతారు. కానీ వీరిలో కొంతమంది వైన్‌ బాబులు కూడా ఉంటారు.

Update: 2021-11-24 09:15 GMT

Wine: ఈ వైన్‌ గురించి మీకు తెలుసా.. చాలా స్పెషల్‌..?

Wine:మందుబాబులలో చాలామంది బ్రాంది, విస్కీ, బీర్, రమ్‌ తాగుతారు. కానీ వీరిలో కొంతమంది వైన్‌ బాబులు కూడా ఉంటారు. వీరు కొంచెం ప్రత్యేకం. ఎందుకంటే వైన్‌ని తెగ లైక్‌ చేస్తారు. ఇది తాజా ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేస్తారు. ద్రాక్ష పళ్లని చితక్కొట్టి, అనంతరం కుళ్లబెట్టి వైన్‌ తయారు చేస్తారు. అయితే గ్రీస్‌లో కొన్ని చోట్ల సముద్రపు నీళ్లలో ద్రాక్షని కుళ్లబెట్టి వైన్‌ను తయారు చేస్తున్నారు. సముద్రపు ఉప్పు వల్ల ఇది ప్రత్యేకంగా మారుతుంది. ఇది ఎలాగో తెలుసుకుందాం.

ఈ ప్రత్యేకమైన వైన్‌ను గ్రీకు ద్వీపమైన థాసోస్‌లో తయారుచేస్తారు. ఇక్కడి సముద్రంలో ఈ ప్రత్యేకమైన వైన్ తయారు చేస్తారు. దీనిని తయారు చేయడానికి జర్మనీ నుంచి కొంతమంది ఇక్కడకి వస్తారు. ఈ వైన్‌ను ఆక్వానోయిన్ వైన్ అంటారు. ఈ వైన్ తయారు చేయడానికి ద్రాక్షపండ్లను మొదటగా తీసి కొన్ని బుట్టల్లో నింపుతారు. ఈ బుట్టలు పూర్తిగా మూసివేస్తారు. తరువాత డైవర్ సహాయంతో ద్రాక్షతో నిండిన ఈ బుట్టలను సముద్రంలో 15 మీటర్ల దిగువన ఉంచుతారు.

ఇవి మునిగిపోకుండా వీటికి ప్రత్యేక బెలూన్లను కడుతారు. ఈ బుట్టలు దాదాపు 5-6 రోజులు నీటిలో ఉంటాయి. అంటే ద్రాక్ష సముద్రపు నీటిలో మునిగిపోతుంది. దీంతో సముద్రపు నీటి వల్ల ద్రాక్ష రుచి పూర్తిగా మారిపోతుంది. ఈ వైన్‌లో ఉప్పు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది రుచిని మారుస్తుంది.

ఈ వైన్ తయారు చేయడం చాలా పాత పద్ధతి అయినప్పటికీ ఉప్పు నీరు దీని రుచిని పెంచుతుంది. ఇప్పుడు ఈ పాత పద్దతి ప్రజలను ఆకర్షిస్తోంది అందుకే దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ వైన్ తయారీ పద్ధతి సుమారు 2000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. అంతే కాకుండా ఇక్కడి భూమి కూడా ద్రాక్షకు సారవంతమైనది కావడం విశేషం. కానీ 60 ఏళ్ల క్రితం ఇక్కడి వైన్‌ తయారీ పనిని వదిలిపెట్టగా ఇప్పుడు జర్మనీ ప్రజలు మళ్లీ దీన్ని ప్రారంభించారు.

Tags:    

Similar News