World Hepatitis Day 2020: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం

Update: 2020-07-28 06:42 GMT
ప్రతీకాత్మక చిత్రం

World Hepatitis Day 2020: ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) ప్రతిఏటా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. కాలేయ వ్యాధికి సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. హెపటైటిస్‌-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్‌ శామ్యుల్‌ బ్లూమ్‌బర్గ్‌ గౌరవార్థం ఆయన పుట్టినరోజు (జూలై 28) నాడు జరిపిస్తారు.

ప్రస్తుత మనుషులు జీవిస్తున్న వాతావరణ పరిస్థితులు, వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇతర కారణాల వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఆయా వ్యాధుల్లో ఈ హెపటైటీస్‌వ్యాధి కూడా ఒకటి. దీన్ని నిర్లక్షం చేస్తే వారి ప్రాణాలకే ప్రమాదం. ఈ హెపటైటిస్ (Hepatitis) కాలేయానికి చెందిన వ్యాధి. ఇవి వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని మందులు మొదలైన వివిధ కారణాల వలన కలుగుతుంది. వీటిలో వైరస్ వలన కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి మనిషి శరీరంలోని కాలేయం(లివర్‌)పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఎ, బీ, సీ, డీ,ఈ లుగా వెలుగుచూసే ఈ వ్యాధిలో హెపటైటిస్-ఎ వైరస్ ద్వారా వచ్చేది లివర్ వ్యాధి. ఇది కలుషితమైన నీటి ద్వారా కాని, లేక కలుషితమైన ఆహారం ద్వారా కాని వ్యాప్తి చెందుతుంది. ప్రతి యేటా, ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగలక్షణాలు మొదలయ్యే వరకు ( ఇంక్యుబేషన్ పీరియడ్) సాధారణంగా, రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. హెపటైటిస్-ఎ టీకాతో ఈ వ్యాధిని నిరోధించవచ్చు.

హెపటైటీస్‌ బీ తీవ్రత సిర్రోలిక్‌దశకు చేరుకుని ఏకంగా కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ దశలో కాలేయ మార్పిడి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ హెపటైటీస్‌నివారణే ధ్యేయంగా ఎక్కువ నిధులు కేటాయించాలని పిలుపునిచ్చింది. ఈ వ్యాధిపై ప్రజలలో అవగాహన క‌లిగించే దిశగా జూలై 28వ తేదీన హెపటైటిస్‌నివారణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.

ఎప్పుడు ప్రారంభించారు...

ఈ కాలేయ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల ప్రజలపై ప్రభావితం చూపిస్తుంది. ఈ వ్యాధి తీవ్రత వల్ల దీర్ఘకాలిక వ్యాధికి గురై ప్రతి సంవత్సరం 1.34 మిలియన్ల మంది చనిపోతున్నారు. దీంతో 2004, అక్టోబరు 1న యూరోపియన్, మిడిల్ ఈస్టర్న్ పేషెంట్ గ్రూప్స్, బేబీ మురియెల్ సమన్వయంతో అంతర్జాతీయ హెపటైటిస్ సి అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. వేరువేరు సమూహాలు వేర్వేరు తేదీలలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ కారణంగా 2008లో వివిధ ప్రాంతాలలోని రోగులు ప్రపంచ హెపటైటిస్ అలయన్స్ సంస్థ మే 19ను మొదటి ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవంగా ప్రకటించింది.

కాలేయ వ్యాధి దినోత్సవం నిర్వహించాలన్న ఆలోచన కటక్ లో వచ్చింది. హెపటైటిస్‌-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్‌ శామ్యుల్‌ బ్లూమ్‌బర్గ్‌ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28న ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని కటక్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ ప్రతిపాదించాడు. 2010, మే నెలలో జరిగిన 63వ ప్రపంచ ఆరోగ్య సభలో ఈ ప్రతిపాదన ఆమోదించబడి, జూలై 28న పంచ కాలేయ వ్యాధి దినోత్సవంగా ప్రకటించబడింది.

ఈ రోజు నిర్వహించే కార్యక్రమాలు

ప్రతి సంవత్సరం 100కి పైగా దేశాలలో ప్రదర్శనలు, ప్రచారాలు, కచేరీలు, టాక్ షోలు, ఫ్లాష్ మాబ్స్, టీకా డ్రైవ్‌లు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ సమూహాలు, రోగులు, న్యాయవాదులు జూలై 28న జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెపటైటిస్ అలయన్స్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ నివేదికను ప్రచురిస్తాయి.




Tags:    

Similar News