శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా అందరికి గుర్తుండే ఉండే ఉంటుంది.. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు.. ఈ సినిమా నేటితో 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ కోసం..
* ఈ సినిమాని ముందుగా రజినీకాంత్ తో తీద్దామని అనుకున్నారట దర్శకుడు శంకర్... కానీ స్టార్ హీరోతో సినిమాని తీయలేను ఏమో అని ఆ ఆలోచన మానుకున్నారట..
* ఆ తర్వాత ఈ సినిమా కథని నటుడు విజయ్ కి చెప్పారట.. ! కానీ అయన ఈ సినిమాని రిజెక్ట్ చేసారట.. !
* విజయ్ నుండి ఈ కథ నటుడు కమల్ హసన్ కి వెళ్లిందట.. ! అప్పటికే అయన హేరామ్ అనే షూటింగ్ లో బిజీగా ఉండడంతో కథ అక్కడినుండి అర్జున్ దగ్గరికి వెళ్లిందట..
* అప్పటికే అర్జున్ తో జెంటిల్ మెన్ అనే సినిమాని చేసాడు శంకర్.. ఇక హీరోయిన్ మీనాని అనుకోగా అప్పటికే అర్జున్ తో మీనా రిధమ్ అనే సినిమా చేయడంతో ఆమెను వద్దు అనుకోని మనిషా కోయిరాలాను తీసుకున్నాడు శంకర్..
* మరో పాత్రకి శిల్పాశెట్టిని అనుకోగా లైలాను తీసుకున్నాడు శంకర్
* ఈ సినిమా నవంబర్ 07 న 1999 తమిళ్ లో ముదవలన్ అనే పేరుతో విడుదల అయింది. ఇక అదే సంవత్సరం నవంబర్ 9 న తెలుగులో ఒకే ఒక్కడు పేరుతో విడుదల అయింది.
* ఈ సినిమా ప్రారంబోత్సవానికి కమల్ హసన్ వచ్చాడు. వంద రోజుల ఫంక్షన్ కూడా ఆయనే రావడం విశేషం..
* ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం ప్రేక్షకులను బాగా అలరించింది.