YS Sharmila: కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల
YS Sharmila: ఖర్గే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
YS Sharmila: వైఎస్‌ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే, రాహుల్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా భర్త అనిల్‌తో కలిసి పార్టీ కార్యాలయానికి వెళ్లారు షర్మిల. ఈ సందర్భంగా షర్మిలకు కండువా కప్పిన ఖర్గే.. ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు షర్మిల. ఇక నుంచి వైఎస్‌ఆర్‌టీపీ కూడా కాంగ్రెస్ ఒక భాగమని అన్నారు. వైఎస్ఆర్ కూతురిగా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు గర్వంగా ఉందన్నారు. వైఎస్‌ఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని అన్నారు షర్మిల.