బాజిందర్ సింగ్ కు రేప్ కేసులో జీవిత ఖైదు

Bajinder Singh: బాజిందర్ సింగ్ కు మొహాలీ కోర్టు మంగళవారం నాడు జీవిత ఖైదు విధించింది.

Update: 2025-04-01 07:48 GMT

బాజిందర్ సింగ్ కు రేప్ కేసులో జీవిత ఖైదు

Bajinder Singh: బాజిందర్ సింగ్ కు మొహాలీ కోర్టు మంగళవారం నాడు జీవిత ఖైదు విధించింది. పంజాబ్ కు చెందిన ఆయన 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిందుకు కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనకు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురిని కోర్టు నిర్ధోషులుగా తేల్చింది.

హర్యానాకు చెందిన బాజిందర్ సింగ్ 2012లో మతబోధకుడిగా మారారు. జలంధర్, మొహాలీల్లో ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేశారు.ఆయనకు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. 2018 ఫిబ్రవరిలో కపుర్తలాకు చెందిన యువతి బాజిందర్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

అసలు ఏం జరిగింది?

జిరక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతిని విదేశాలకు తీసుకెళ్తానని హామీ ఇచ్చి అత్యాచారం చేసినట్టు బాధితురాలు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయటకు చెబితే అత్యాచారం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు ఆమె ఆ ఫిర్యాదులో తెలిపారు. అయితే ఈ ఆరోపణలను బాజిందర్ సింగ్ కొట్టిపారేశారు. ఈ ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటైంది. లైంగిక ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేసింది.

Tags:    

Similar News