Annamalai: ఓ ఉజ్వల దశ ముగిసిందా..? అన్నమలై త్యాగానికి అర్థముందా?
Annamalai: అన్నమలై తానే రేసులో లేనన్న మాట చెప్పినప్పటికీ, ఆయన పాత్ర రాజకీయంగా ఇంకా ముగియలేదు. ఇది కేవలం ఒక అధ్యాయం ముగింపు మాత్రమే.. మరో కొత్త పేజీ మొదలవ్వబోతుంది.

Annamalai: ఓ ఉజ్వల దశ ముగిసిందా..? అన్నమలై త్యాగానికి అర్థముందా?
Annamalai: కన్నడ మాజీ ఐపీఎస్ అధికారి నుంచి తమిళనాడు బీజేపీ నేతగా ఎదిగిన కే.అన్నమలై ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తేల్చేశారు. పొలిటికల్ మైలేజ్ తీసుకున్న ఆయన ఈ నిర్ణయం తీసుకోవడమే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవలే జరిగిన మాధ్యమ సమావేశంలో ఆయన స్పష్టం చేసిన ప్రకారం, తాను ఇకపై పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనే లేనని తేల్చేశారు.
తమిళనాట బీజేపీని తన ముద్రతో నడిపించిన అన్నమలై, గతంలో ఏఐఎడీఎంకేపై విమర్శల జాడిపెట్టిన వ్యక్తే. ముఖ్యంగా జయలలిత, అన్నాదురై వంటి నేతలపై కామెంట్లు చేసి డ్రావిడ పార్టీలతో కలయికకు వ్యతిరేకత వ్యక్తం చేసిన నేత కూడా ఆయనే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీజేపీ–ఏఐఎడీఎంకే పొత్తు పునరుద్ధరణ చర్చల నేపథ్యంలో, అన్నమలై వైఖరిలో మార్పు కనిపించటం విశేషం.
అన్నమలై తప్పుకోవడం వెనక అసలైన కారణం ఒకటి కాదు. పార్టీ వ్యూహాత్మకంగా విస్తృత సామాజిక వర్గాల్లోకి వెళ్లాలనే లక్ష్యంతోనూ, ఓటు బ్యాంక్ దృష్టితోనూ నాయకత్వ మార్పు జరుగుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నమలై, ఎడప్పాడి పలానిస్వామి ఇద్దరూ గౌండర్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్ల, పార్టీ సామాజిక సమతుల్యత కోసం కొత్త నాయకుడిని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
తాను పదవి కోసం పోటీ పడలేదని చెబుతూ, పార్టీ అభివృద్ధే తనకు ముఖ్యమని అన్నమలై వ్యాఖ్యానించడం వెనక గొప్ప పొలిటికల్ సెంస్ ఉంది. పార్టీకి తాను అన్ని వేళ్లా అంకితంగా ఉన్నానని, ఇక నుంచి కూడా అలాగే కొనసాగుతానని పరోక్షంగా చెప్పినట్టే అయ్యింది.
తమిళనాట బీజేపీకి ఏ సీటూ రాకపోయినా, పార్టీకి వచ్చిన ఓటు శాతం మాత్రం పెరిగింది. అన్నమలై ఈ క్రెడిట్‌కు అసలైన హక్కుదారు. ఎన్నికల తర్వాత రాజకీయ సన్నివేశం మారినప్పుడు, పాడయాత్రలు, ప్రజా మద్దతుతో పార్టీని నిలబెట్టినది ఆయనే.
తమిళనాట నాయకత్వంలో మార్పు రావొచ్చు. కానీ అన్నమలై పాత్ర ఇక పూర్తిగా ముగుస్తుందా? అస్సలు కాదు. బీజేపీ ఎక్కడైనా తనకు అవసరమైన యువ నాయకత్వాన్ని పోషించడంలో ముందుంటుంది. అన్నమలైకి కేంద్రంలో లేదా ఇతర కీలక బాధ్యతల్లో అవకాశం రావడం ఆశ్చర్యం కాదు.