Pharma-Trump: ఇండియాకు ట్రంప్ మేలు చేశారా? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు?
Pharma-Trump: ఔషధాలు, గ్యాస్, ఆయిల్, సెమీ కండక్టర్లు, కాపర్ లాంటి కీలక ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపు ఇవ్వడంతో అంతా ఖుషి అవుతున్నారు.
Pharma-Trump: ఇండియాకు ట్రంప్ మేలు చేశారా? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు?
Pharma-Trump: హమ్మయ్య.. ట్రంప్‌గారి సుంకాల గండం గట్టెక్కింది..! ఫార్మా రంగం ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. మినరల్స్ ఇండస్ట్రీ కూడా రిలాక్స్ అయ్యింది. కొన్ని రోజులుగా ఈ రెండు రంగాలు చాలా టెన్షన్ పడ్డాయి. ట్రంప్ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తారన్న వార్తలు మార్కెట్‌లో అలజడిని సృష్టించాయి. అయితే ట్రంప్ మాత్రం ఈ రెండు రంగాలతో పాటు మరి కొన్ని రంగాలకు మినాహాయింపులిచ్చారు. ఆయన తీసుకున్న నిర్ణయం కొన్ని రంగాల్లోకి ఊరటగా మారింది. ముఖ్యంగా ఔషధాలు, గ్యాస్, ఆయిల్, సెమీ కండక్టర్లు, కాపర్ లాంటి కీలక ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపు ఇవ్వడంతో అంతా ఖుషి అవుతున్నారు. ఓవైపు మిగతా రంగాలు ట్రంప్ టారిఫ్‌ల భారంతో డీలా పడిపోతే.. వీటికి మాత్రం ఇది నిజంగా గుడ్‌న్యూస్‌గానే చెప్పాలి.
ఇక టారిఫ్ మినహాయింపు వార్త బయటకు వచ్చిన కొద్ది గంటలకే మార్కెట్‌లో ఫార్మా రంగం ఊహించని ఊపందుకుంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఒక్కరోజులోనే 4 శాతం లాభంతో గ్రీన్‌లోకి దూకింది. ముఖ్యంగా అమెరికాలో బలమైన ప్రెజెన్స్ ఉన్న కంపెనీలు మరింత వేగంగా పైకి వచ్చాయి. గ్లాండ్ ఫార్మా, ఔరోబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా షేర్లు ఒక్కరోజులోనే 10 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. ట్రంప్ టారిఫ్‌ల ముప్పు తొలగిపోవడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం తిరిగి వచ్చిందని స్పష్టంగా కనిపించింది. మిగతా రంగాలు టెన్షన్‌లో తడబడుతుండగా.. ఫార్మా మాత్రం ఉప్పెనలా పైపైకి లేచింది.
నిజానికి భారత్ ఔషధ రంగం చాలాకాలంగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడుతూ ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనరిక్ మందుల సరఫరాలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. యుఎస్‌లో వినియోగించే ప్రతి నాలుగు మందులలో ఒకటి ఇండియాలోనే తయారవుతుందంటే నమ్మగలరా? అమెరికాలో భారత ఔషధ కంపెనీలకు ఉన్న డిమాండ్ కారణంగా.. ఏడాదికి దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన మందులు ఇండియా నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఈ స్థాయిలో వ్యాపారం సాగుతున్న సమయంలో ట్రంప్ ఈ రంగానికి మినహాయింపు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఒకవేళ ట్రంప్ ఫార్మాకు కూడా టారిఫ్‌లు విధించి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. దాని ప్రభావం ఎక్కడివరకూ వెళ్లేదో చెప్పడం కూడా కష్టమే. నిజానికి ఇది కేవలం ఒక ఉపశమనం మాత్రమే కాదు.. అటు ప్రభుత్వానికి, ఇటు పరిశ్రమకు ఇది అమెరికా ఇచ్చిన భరోసాగా చెప్పవచ్చు.