Wayanad Disaster:వయనాడ్ లో వరద విలయం..రంగంలోకి ఆర్మీ శునకాలు ..పెరుగుతున్న మృతుల సంఖ్య
Wayanad Disaster: వయనాడ్ లో వరద విలయం కొనసాగుతోంది. వరద, బురద ప్రవాహంతో కొందరు కొట్టుకుపోయారు. దీంతో వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Wayanad Disaster:ప్రక్రుతి ప్రకోపంతో అతలాకుతలమైన వయనాడ్ లో సహాయక చర్యలకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే 146 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. వరద, బురద ప్రవాహంతో కొందరు కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయచర్యలు ముమ్మరం చేశారు. కానీ అక్కడి పరిస్థితులు అందకు సహాకరించడంలేదు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు తీవ్ర ప్రయాత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత కేరళ ప్రభుత్వం కూడా 2 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. మరోవైపు, భారత సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో సహా వివిధ విభాగాలు వాయనాడ్‌లో పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. సైన్యం సుమారు 1000 మంది ప్రాణాలను రక్షించాయి.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వాయనాడ్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్‌లో భారత సైన్యం తాత్కాలిక వంతెన సహాయంతో దాదాపు 1000 మందిని రక్షించడంలో విజయం సాధించింది. ఆ ప్రాంతంలో శాశ్వత మౌలిక సదుపాయాలు కొట్టుకుపోవడంతో సైన్యం ఒక వంతెనను నిర్మించింది. రాష్ట్ర బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో చురుకుగా పాల్గొంటున్నాయి . నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా సహకరిస్తున్నాయి.తాజా అప్‌డేట్ ప్రకారం, కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు మొత్తం 146 మంది మరణించారు. ఇందులో 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని సమాచారం. అధికారికంగా 98 మంది గల్లంతైనప్పటికీ వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు.
ఒక సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ, చీకటి కారణంగా రెస్క్యూ పనిని నిలిపివేయాలని సూచించాము. మళ్లీ తెల్లవారి సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని 1000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని మృతదేహాలను కూడా బయటకు తీశారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో 18 నుంచి 25 మంది చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం న్యూఢిల్లీ నుంచి కొన్ని స్నిఫర్ డాగ్‌లను కూడా రప్పిస్తున్నట్లు వెల్లడించారు.