Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకి హెచ్చరిక.. పొరపాటున కూడా ఈ పని చేయవద్దు..!

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకి హెచ్చరిక.. పొరపాటున కూడా ఈ పని చేయవద్దు..!

Update: 2022-04-24 12:30 GMT

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకి హెచ్చరిక.. పొరపాటున కూడా ఈ పని చేయవద్దు..!

Post Office: దేశంలో డిజిటలైజేషన్ వేగం పెరిగింది. దాదాపు అన్ని రంగాలు ఆన్‌లైన్ అవుతున్నాయి. ప్రభుత్వం కూడా డిజిటలైజేషన్‌కు పెద్దపీట వేస్తోంది. ఈ రోజుల్లో ప్రజలు డబ్బును బదిలీ చేయడానికి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI చెల్లింపు మొదలైన మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితిలో పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో పాటు మోసాల సంఘటనలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజలకు రకరకాల ఆఫర్లు, రాయితీలు ఇస్తూ వారి ఖాతాల్లోంచి లక్షల రూపాయలను లాక్కుంటున్నారు. ఈ పరిస్థితిలో ఈ మోసగాళ్ళ నుంచి అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ పోస్ట్ ఖాతాదారులని హెచ్చరించింది. ఈ నేరగాళ్లు ప్రజలను ట్రాప్ చేయడానికి, వివిధ రకాల సర్వేలు, క్విజ్‌లని ఉపయోగిస్తారని తెలిపింది.

ఫేక్ లింక్‌ల పట్ల జాగ్రత్త

ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో అనేక రకాల నకిలీ వెబ్‌సైట్‌లు, యూఆర్‌లు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా క్లిక్ చేయాలని ఇండియా పోస్ట్ తెలిపింది. వివిధ సర్వేల పేరుతో ప్రజలను మోసం చేయడానికి ఇది పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, ఈమెయిల్, ఎస్‌ఎంఎస్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనేక రకాల సర్వేలు, క్విజ్‌ల ద్వారా ప్రజలు మోసపోతున్నారు. ప్రభుత్వ సబ్సిడీ ఇస్తానని లింక్‌లపై క్లిక్ చేయమని అడుగుతారు. ఆ తర్వాత బురడి కొట్టిస్తారు.

ప్రభుత్వం ఎటువంటి సర్వేను ప్రారంభించలేదని పోస్టాఫీసు వినియోగదారులను హెచ్చరించింది. కస్టమర్‌లు ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్ట్‌ల ఉచ్చులో పడకుండా ఉండాలి. బ్యాంకు వివరాలు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ షేర్‌ చేసుకోవద్దు. అలాగే మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, కార్డ్ CVV నంబర్, PINని షేర్ చేయవద్దు.

Tags:    

Similar News