Viral Video: తుఫాన్ లో తల్లికి తోడుగా.. స్ఫూర్తిని రగిల్చేనా ఆ చిన్నారి పనులు..
* కన్నతల్లిపై కసాయితనం చూపిస్తున్న కొడుకులు ఎందరో. అమ్మకు ఆసరాగా నిలవాల్సిన సమయంలో ఒంటరిగా వదిలేసి బాధ్యతను మరచి ప్రవర్తిస్తున్న కొడుకులు ఎందరో..అలాంటివారందరికీ బుద్ధి వచ్చేలా ఓ చిన్నారి చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది.
Viral Video: కన్నతల్లిపై కసాయితనం చూపిస్తున్న కొడుకులు ఎందరో. అమ్మకు ఆసరాగా నిలవాల్సిన సమయంలో ఒంటరిగా వదిలేసి బాధ్యతను మరచి ప్రవర్తిస్తున్న కొడుకులు ఎందరో..అలాంటివారందరికీ బుద్ధి వచ్చేలా ఓ చిన్నారి చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది.
అమ్మను మించిన దైవం ఈ జగత్తులోనే లేదు. అమ్మ మరో జన్మ ఎత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లి రుణం తీర్చుకోవాల్సిన పిల్లలు తమ బాధ్యత కాదనేలా వ్యవహరిస్తున్నారు. అమ్మను కడవరకు కంటికి రెప్పలా చూసుకోవాల్సినవారే..భారంగా భావించి ఇంటినుంచి గెంటేస్తున్నారు. అలాంటి వారందరూ సిగ్గు పడేలా నెట్టింట ఒక వీడియో వైరల్ అవుతోంది.
భారీ వర్షం రావడంతో రోడ్డు సైడ్ వ్యాపారం చేసుకుంటున్న మహిళ..తన సరుకు తడిచిపోకుండా ఉండేందుకు టార్పాలిన్ పట్టా కప్పుతుంటుంది. వర్షానికి తోడు ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో షాపును కాపాడేందుకు ఓ బాలుడు తన తల్లికి సహాయం చేయడాన్ని వీడియోలో మనం చూడొచ్చు. గాలికి కుర్చీ కొట్టుకుపోవడంతో ఆ చిన్నారి పరుగు పరుగున వెళ్లి ఆ కుర్చీని తీసుకొచ్చాడు. చిన్న వయసులోనే తన బాధ్యతను బాలుడు గుర్తెరగడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.
ఈ వీడియోని నాగాలాండ్ మంత్రి తెంజన్ ఇమ్న అలంగ్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. వయసు చిన్నగా ఉన్నా పరిస్థితులు బాధ్యతలను నేర్పుతున్నాయని పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. నాగాలాండ్ మంత్రి పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది. బాలుడిని ట్విట్టర్ యూజర్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చిన్న వయసులోనే బాలుడు చాలా పెద్ద మనిషి తరహాలో ఆలోచించాడని, తల్లికి ఆసరాగా నిలవడం చాలా ముచ్చటగా ఉందని కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. ఇది ఎంతో ఇన్స్ పిరేషన్ వీడియో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజమే, ఈ చిన్నారి తన తల్లికి సహాయంగా నిలబడడం నిజంగా చూడముచ్చటగా ఉంది. ఈ చిన్నారి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లిని భారంగా భావిస్తున్న కొడుకులు మారాలని మరికొందరు ఆశపడుతున్నారు.