భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకింది. తాజాగా మరో కేంద్ర మంత్రికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నాకు కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. రెండురోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన వారు తగు జాగ్రత్తలు తీసుకోండి అని ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విటర్‌లో వెల్లడించారు.
ఇదిలాఉంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ ఉభయసభల సభ్యులకు కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 25మందికిపైగా పార్లమెంట్ సభ్యులకు కరోనా పాజిటీవ్ వచ్చిది. దాదాపు మరో 50మంది పార్లమెంట్ సిబ్బంది కూడా ఈ వైరస్ బారినపడినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో సభలు కొనసాగుతుండగానే బుధవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకిన మరునాడే. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనా నిర్ధారణ కావడంతో సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది.