నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో దేశంలో రెండోదశ కరోనా వైరస్ వ్యాప్తి, దేశ ఆర్ధిక వ్యవస్థలపై మంత్రివర్గం చర్చించనుంది. పలువురు కేంద్ర మంత్రులకు కరోనా రావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మండలి భేటి కానుంది. భారత్‌లో అమెరికా మంత్రుల బృందం పర్యటిస్తున్న నేఫథ్యంలో అమెరికాతో చేసుకోవలిసిన పలు కీలక ఒప్పందాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఎల్ఏసీ వద్ద యుద్ధానికి సిద్ధమంటూ డ్రాగన్ దేశం కవ్వింపులకు దిగుతుండడంపై.. చైనా దూకుడుపై తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనున్నారు.