Lockdown: కేరళలో రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్

Lockdown: ఇవాళ, రేపు లాక్‌డౌన్ అమలు * కేసుల పెరుగుదలతో ప్రభుత్వ నిర్ణయం

Update: 2021-07-31 03:55 GMT

Representational Image

Lockdown: కేరళలో కరోనా విజృంభిస్తుంది. వరుసగా మూడో రోజు 22 వేలకు పైగా కరోనాకేసులు నమోదు అయ్యాయి. రాజధాని తిరువనంతపురం సహా పది జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండు రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వారాలుగా పదిపైనే పాజిటివ్ రేటు ఉంది. టెస్టులు 13శాతం తగ్గినా అధికంగానే కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్ ఉధృతిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యుల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపింది.

కేరళలోని ఈ పరిస్థితిని కరోనా థర్డ్‌వేవ్‌ సూచికగా నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో ఆగస్టు మొదటి వారంలో థర్డ్‌ వేవ్‌ ప్రారంభం కానుందని గతంలో తాము వేసిన అంచనాకు ఇది దగ్గరగా ఉందని చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి తీరును తెలిపే ఆర్‌ వ్యాల్యూ కేరళలో క్రమంగా పెరుగుండటంతో మళ్లీ కొవిడ్‌ పడగ విప్పుతోందా? అనే ఆందోళన కలిగిస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్‌ వ్యాల్యూ 1.11 ఉంది. ఆర్‌ వ్యాల్యూ 1 కంటే అధికంగా ఉంటే దశలవారీగా బాధితుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని అంటు వ్యాధి దశగా పేర్కొంటారు.

Full View


Tags:    

Similar News