Zika virus: విస్తరిస్తున్న జికా వైరస్..పుణెలో రెండు కేసులు నమోదు

Zika virus: జికా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో రెండు కేసులు నమోదు అయ్యాయి. పుణెలోని ఓ వైద్యుడు, ఆయన కుమార్తెకు జికా వైరస్ సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

Update: 2024-06-27 00:27 GMT

chandipura virus Death : ఛండీపూర్ వైరస్‎తో తొలి మరణం..నాలుగేళ్ల బాలిక మృతి

Zika virus: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షాల రాకతో ఒకవైపు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుండగా, మరోవైపు అనేక రోగాల బారిన పడే ప్రమాదం కూడా పెరిగింది. ఈ క్రమంలో జికా వైరస్‌ మరోసారి కలకలం రేపింది. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఈ వైరస్‌ సోకిన రెండు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ప్రారంభంలో ముంబైలో కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని వేగంగా పెంచుతుంది.

జికా వైరస్ కొరలు చాచుతోంది. మహారాష్ట్రలోని పుణెలో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఓ వైద్యుడు, ఆయన కుమార్తెకు జికా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పుణె కార్పొరేషన్ అధికారులు తెలిపారు. నగరంలోని ఎరండ్ వానే ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడికి జ్వరంతోపాటు శరీరంపై దద్దర్లు వచ్చాయి. దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన రక్తనమూనాలను నగరంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. జూన్ 21న ఆయనకు జికా వైరస్ పాజిటివ్ గా వచ్చినట్లు నిర్ధారించారు అధికారులు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. వైద్యుడి కుమార్తెకు కూడా వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. రెండు కేసులు నమోదు అవ్వడంతో అప్రమత్తమైన వైద్య అధికారులు ఆ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలను చేపట్టారు.

జికా వైరస్ అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, జికా వైరస్ ఫ్లేవివైరస్ కుటుంబానికి చెందిన దోమల ద్వారా సంక్రమించే వ్యాధికారక. ఈ వైరస్ ప్రధానంగా ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇవి ఎక్కువగా పగటిపూట కుట్టుతాయి. ఈ దోమలు డెంగ్యూ, చికున్‌గున్యా, అర్బన్ ఎల్లో ఫీవర్‌లను కూడా వ్యాప్తి చేస్తాయి.

జికా వైరస్ లక్షణాలు?

WHO ప్రకారం, జికా వైరస్ సోకిన చాలా మంది వ్యక్తులు దాని లక్షణాలు త్వరగా కనిపించవు. అయినప్పటికీ సాధారణంగా సంక్రమణ తర్వాత 3-14 రోజులకు ప్రారంభమవుతాయి. సాధారణంగా 2-7 రోజుల వరకు ఉంటాయి. జికా వైరస్ వల్ల వచ్చే జ్వరం ప్రధాన లక్షణాలు ఇలా ఉంటాయి.

-దద్దుర్లు

-జ్వరం

-కండ్లకలక

-కండరాలు, కీళ్ల నొప్పి

-తలనొప్పి

Similar News