Venkaiah Naidu: వెంకయ్యనాయుడు ట్విట్టర్ బ్లూ టిక్ ను తొలగించిన యాజమాన్యం
Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ అకౌంట్‌కి ఉన్న బ్లూ టిక్‌ను ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది
Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ అకౌంట్‌కి ఉన్న బ్లూ టిక్‌ను ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది. కానీ, అధికారిక ఉపరాష్ట్రతి సెక్రటేరియట్ ట్విట్టర్ హాండిల్‌కు బ్లూ టిక్ అలాగే కొనసాగుతోంది.
ఉపరాష్ట్రపతి లాంటి ఉన్నత హోదాలో ఉన్నవ్యక్తి ఐడీ బ్లూ టిక్‌ను తొలగించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. సాధారణంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులకు, సంస్థల ట్వట్టర్ అకౌంట్‌లకు బ్లూ టిక్‌ను అందిస్తారనే విషయం తెలిసిందే.
అయితే వెంకయ్య నాయుడు ట్విట్టర్ ఖాతా కొన్ని రోజులుగా క్రీయాశీలకంగా లేదని అందుకే ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుందనే వాదన వినిపిస్తోంది. కొన్ని నెలలుగా క్రియాశీలకంగా లేని అకౌంట్‌లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌ను తొలిగిస్తామని ట్విట్టర్ తన నియమనిబంధనలో తెలిపింది. ఇక సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం విధిస్తోన్న పలు నిబంధనల నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ సంఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది.